Anasuya Bharadwaj's Latest Pics: ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన యాంకర్ 'అనసూయ భరద్వాజ్' (Anasuya Bharadwaj). షోకి వచ్చిన అనతి కాలంలోనే తన అందం, యాంకరింగ్‌తో బాగా పాపులర్ అయ్యారు. స్టార్ యాంకర్ అయిన అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా దూసుకుపోతున్నారు. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించిన అనుకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
అనసూయ భరద్వాజ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ టీవీ షో, సినిమా, సోషల్ మీడియాలో ఒక రేంజ్లో రచ్చ చేస్తారు. పొట్టి దుస్తులు వేసినా, సారీ కట్టినా, లంగాఓణీ అయినా జబర్దస్త్ బ్యూటీ అందమే వేరు. తాను ధరించే డ్రెస్సులపై నెటిజన్లు ఎన్ని కామెంట్లు చేసినా.. వారికీ ధీటుగా బదులు ఇస్తూ దూసుకుపోతారు.
తాజాగా అనసూయ భరద్వాజ్ లంగాఓణీలో తళుక్కుమన్నారు. ఈరోజు ప్రసారం అయ్యే జబర్దస్త్ షో కోసం లంగాఓణీ వేసిన అను.. ఆహా అనిపిస్తున్నారు. నడుము ఒంపులు, నాభి అందాలను చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. మెరూన్ అండ్ బ్లాక్ లంగాఓణీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏ ఫొటోలకు లైకుల వర్షం కురుస్తోంది.
Also Read: Covid 19 Endemic: ఎట్టకేలకు దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందో తెలుసా?
సంక్రాంతి పండగ సందర్భంగా అనసూయ భరద్వాజ్ తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. ఇంటి దగ్గరలోని పార్కులో భర్త, పిల్లలతో కలిసి కైట్స్ ఎగురవేశారు. ఎర్రని చీరలో ఎరుపురంగు కైట్ పట్టుకుని నడుస్తున్న అను ఫొటో ఒకటి అప్పడు నెట్టింట వైరల్ అయింది.
టాలీవుడ్లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ అను తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో గృహిణిగా తన నటనతో మెస్మరైజ్ చేసారు. తాజాగా వచ్చిన పుష్పలో కూడా మెప్పించారు.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే అభిమానులతో ముచ్చటించడం, నచ్చని విషయాన్ని ముఖం మీదే చెప్పేయడం అనసూయ నైజం. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన చిట్‌చాట్‌లో ఓ నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. మిమ్మల్ని అక్క అనాలా లేదా ఆంటీ అనాలా?' అని నెటిజన్ అడగ్గా.. 'ఏదీ వద్దు. నన్ను అలా పిలవడానికి నేనెవరో నీకు అంతగా తెలీదు. అలాంటప్పుడు నన్ను అక్క, ఆంటీ అనడానికి నువ్వెవరు?' అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook