Balagam delivers massive TRP ratings: ఈ మధ్యకాలంలో చిన్న బడ్జెట్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో బలగం సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ఈ బలగం అనే సినిమా తెరకెక్కించాడు. ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి నిర్మాతగా మారి ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించారు.
అలా వచ్చిన ఈ సినిమా భారీ లాభాలు ఆర్జించి పెట్టింది. ఇక బలగం సినిమా కేవలం థియేటర్లలోనే కాదు ఆ తర్వాత ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఏకంగా ఊర్లకు ఊర్లు స్పెషల్ షోలు వేసుకుని మరీ వీక్షించిన పరిస్థితి కనిపించింది. ఇక ఈ సినిమా బుల్లి తెరలో కూడా తాజాగా సంచలనం సృష్టించింది. ఈ మధ్యకాలంలో ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన స్టార్ మా చానల్ ఈ సినిమాని మొదటిసారి టెలివిజన్ లో ప్రసారం చేసింది.
Also Read: Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా చీరలో హాట్ ట్రీట్.. చూశారా?
ఇక ఈ సినిమాకి మొదటిసారి ప్రసారం చేసినప్పుడు ఏకంగా 14.3 టీఆర్పీ సాధించడం ఆసక్తికరంగా మారింది. ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ నెంబర్ రావడం మామూలు విషయం కాదని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ తో పాటు మురళీధర్ గౌడ్, జయరాం, రూప, కేతిరి సుధాకర్ రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందించారు.
తెలంగాణలోని పిట్ట ముట్టుడు సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించగా అటు కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా వర్కౌట్ కావడంతో సినిమా తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రమే కాదు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలకు కూడా బాగా కనెక్ట్ అయింది. పూర్తి స్థాయి సినిమా అంతా తెలంగాణ నేపథ్యంలోనే సాగినా నైజాం ప్రాంతంతో పాటు ఆంధ్రాలో కూడా ఈ సినిమాకి వసూళ్లు బాగానే వచ్చాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ వేదికల మీద అవార్డులు సంపాదించగా ఇప్పుడు టిఆర్పి కూడా ఒక రికార్డు అని చెప్పుకోవాలి.
Also Read: Anni Manchi Sakunamule Review: అన్నీ మంచి శకునములే' రివ్యూ..ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి