Chhaava Movie 8th day Box office Collecions: ‘ఛావా’ ప్రెజెంట్ భారతీయ బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను పాతర వేస్తూ దూసుకుపోతుంది. ఛత్రపతి శివాజీ తనయుడు ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్’ జీవిత కథతో తెరకెక్కిన ‘ఛావా’ సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లను సాధింస్తోంది. పెద్దగా స్టార్ క్యాస్ట్ లేదు. మల్టీస్టారర్ కాదు. కానీ కథే హీరోగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. ‘ఛావా’ సినిమాతో విక్కీ కౌశల్ తన నట విశ్వరూపం చూపించాడు. విక్కీ కౌశల్ సినీ జీవితం ‘ఛావా’ కంటే ముందు తర్వాత అని చెప్పాలి. కానీ ‘ఛావా’ విడుదల తర్వాత విక్కీ కౌశల్ పేరు టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా మారింది.
ముఖ్యంగా గత కొన్నేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో యాంటీ హిందూ సినిమాల నుంచి ప్రో హిందూ నేషనలిజమ్ వైపు దర్శక, నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. కేవలం స్టోరీని నమ్ముకొని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించాడు. రెండో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడైన ‘శంభాజీ మహారాజ్’ను ‘ఛావా’ అని ముద్దుగా పిలుస్తుంటారు. అదే ఈ చిత్రానికి పేరు పెట్టారు.
‘ఛావా’చిత్రంలో శంభాజీ మహారాజ్ పాత్రలో నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. ముఖ్యంగా 2025లో జాతీయ ఉత్తమ చిత్రంతో పాటు నేషనల్ బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని అవార్డులు ఛావాకు వచ్చి తీరాల్సిందే. ఈ సినిమాలో ఏసుబాయ్ పాత్రలో రష్మిక మందన్న యాక్టింగ్ జోహార్ అనాల్సిందే. అటు ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా తన విలనిజంలో క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. మొత్తంగా తన విలనిజంతో హీరో పాత్రకు మంచి పేరు తీసుకొచ్చాడు. ఈ సినిమా ఎనిమిదో రోజు.. రూ. 24.03 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తంగా రూ. 250 కోట్ల నెట్ వసూళ్లతో దూసుకుపోతుంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఈ సినిమా త్వరలో రూ. 500 కోట్ల నెట్ వసూళ్లు సాధించినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ముందు ముందు ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబడుతుందో చూడాలి.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.