Pawan Kalyan:టాలీవుడ్ లో మెగా హీరోల రేంజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. నిన్న మొన్నటి వరకు వినూతమైన కంటెంట్లతో దూసుకుపోయే మెగా బ్రదర్స్ ..చిరంజీవి, పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక రీమేకులపై ఎక్కువ మోజు చూపిస్తున్నారు. ప్రస్తుతం మలయాళ సినిమాలకు మార్కెట్.. అలానే డిమాండ్ టాలీవుడ్ లో బాగా పెరిగిపోతోంది. అగ్ర హీరోలు సైతం మలయాళం కంటెంట్ రీమేక్ చేయడానికి సిద్ధపడిపోతున్నారు. రేపు సంక్రాంతి బారిలో దిగబోతున్న నాగార్జున నా సామి రంగా చిత్రం కూడా మలయాళం మూవీ రీమేక్ అన్న విషయం మనకు తెలిసిందే.
2019లో వచ్చిన పోరింజు మరియం జోస్ మలయాళం మూవీ నుంచి స్ఫూర్తి తీసుకోని తెరకెక్కుతున్న చిత్రమే.. నా సామిరంగా మూవీ. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ సినిమా నుంచి మూల కథను తీసుకొని.. తెలుగు నేటివిటీకి ,నాగార్జున ఇమేజ్ కు తగ్గట్టుగా చిత్రంలో కొన్ని మార్పులు చేశారు. ఈ డిస్కషన్ తో పాటుగా మరో రెండు మలయాళం సినిమాల గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ చర్చించుకుంటున్నారు.
ఆ రెండు చిత్రాలు కూడా మోహన్ లాల్ సినిమాలే కావడం విశేషం. వాటిలో ఒక చిత్రం నేరు.. కళ్ళు లేని ఒక యువతిపై మంత్రి కొడుకు జరిపిన అత్యాచారానికి ఎదురు తిరిగి ..హీరో ఎలా పోరాడి గెలిచాడు అనే పాయింట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇక ఈ సినిమా వకీల్ సాబ్ 2 కి బాగా సెట్ అవుతుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా చేయడం వల్ల పవన్ కి ఉన్న లాభాలు ఎన్నో.. మొదటిది బయట లొకేషన్స్ తో పని ఉండదు. కోర్టులో జరిగే హై డ్రామా నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి.. ప్రస్తుతం పవన్ బిజీ షెడ్యూల్ కి ఈ రీమేక్ బాగా సూట్ అవుతుంది అనే చర్చ జరుగుతోంది.
మరోపక్క మోహన్ లాల్..లూసిఫర్ 2 షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఆచార్య ప్లాప్ తర్వాత చిరు మోహన్ లాల్ ..లూసిఫర్ ను గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఇక ఇప్పుడు పార్ట్ 2 ని కూడా చిరు రీమేక్ చేసే అవకాశం ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. గాడ్ ఫాదర్ ఊహించిన ఫలితాలను అందించలేదు.. అందుకని గాడ్ ఫాదర్ 2 తో తిరిగి ప్రేక్షకులను మెప్పించే ఉద్దేశం చిరుకి ఉందేమో అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. మరి మెగా బ్రదర్స్ ఆలోచన ఎలా ఉందో చూడాలి.
Also read: Kesineni Nani: టీడీపీకు రాజీనామా చేయనున్న కేశినేని నాని, వైసీపీలో చేరనున్నారా
Also Read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook