Chiranjeevi Donates Blood: కరోనా సెకండ్ వేవ్ సమయంలో పలు జిల్లాల్లో ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాట్లు చేసిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేశారు. తన సతీమణి సురేఖతో కలిసి బ్లడ్ డొనేట్ చేశారు. గతంలో కరోనా ఫస్ట్ వేవ్‌లోనూ రక్తదానం చేయడంతో పాటు తన అభిమానులకు సైతం పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా కూడా డొనేట్ చేయడం తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రక్తదాతలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే 2021 (World Blood Donor Day 2021) శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్న సోదరసోదరీమణులకు బ్లడ్ డోనర్ డే విషెస్ తెలిపారు. ఈ చిన్న పనులతో జీవితాంతం మరో వ్యక్తితో మీకు బంధం ఏర్పడుతుందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. భార్య సురేఖతో కలిసి రక్తదానం చేస్తుండగా తీసిన ఫొటోను చిరంజీవి షేర్ చేసుకున్నారు.
Also Read: Acharya Movie: విడుదలకు ముందే మెగాస్టార్ Chiranjeevi ఆచార్య సాంగ్స్ రికార్డులు
On this #WorldBloodDonorsDay congratulating all Blood Donors & particularly my #BloodBrothers & Sisters who help save lives. It's a great fortune that we can save precious lives thru such simple actions & form a bond for life wid fellow humans,through blood #DonateBloodSaveLives pic.twitter.com/ufTgxlDPEG
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2021
కెరీర్ విషయానికొస్తే, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ చేస్తున్నారు. కరోనా సెకండ్ కారణంగా కొంతకాలం నుంచి షూటింగ్ పనులు వాయిదా వేశారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. ఆ తరువాత లూసిఫర్ రీమేక్ కోసం చిరంజీవి (Chiranjeevi) సిద్ధంగా ఉన్నారు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన లూసిఫర్ సక్సెస్ కావడంతో తెలుగులోకి రీమేక్ అవుతోంది.
Also Read: Chiranjeevi oxygen banks: అప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్.. ఇప్పుడు చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook