Dhanush And Aishwarya Divorce: భారతీయ సినీ పరిశ్రమలో మరో జంట విడాకులు తీసుకుంది. గతంలోనే విడాకులు తీసుకుంటామని ప్రకటించగా.. తాజాగా న్యాయస్థానం వారి బంధానికి ముగింపు పలికింది. న్యాయస్థానం వారి విడాకులకు ఆమోద ముద్ర తెలపడంతో వారి వివాహ బంధం అధికారికంగా తెగిపోయింది. వారే ధనుష్, ఐశ్వర్య. వారిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ చెన్నై ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియతో ధనుష్, ఐశ్వర్యలు చెరో దారి చూసుకున్నారు.
ఇది చదవండి: Sri Gandhari: ‘శ్రీ గాంధారి’లా భయపెట్టేందుకు వచ్చేస్తున్న హన్సిక.. డిఫరెంట్ లుక్‌లో అందాల భామ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకురాలిగా.. నిర్మాతగా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఇక ధనుష్ స్టార్ హీరోగా భారతీయ సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. వీరిద్దరికీ 18 ఏళ్ల కిందట వివాహమైంది. అయితే తమ కాపురంలో భేదాభిప్రాయాలు రావడంతో ఐశ్వర్య, ధనుష్‌ల మధ్య కొన్నాళ్లు గొడవలు జరిగాయి. కాలం గడిచిన కొద్ది అవి పెరుగుతున్నాయే కానీ తగ్గకపోవడంతో ఇక విడిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2022 జనవరి 17వ తేదీన తాము విడాకులు తీసుకుంటున్నట్లు ధనుష్, ఐశ్వర్య ప్రకటించారు.
ఇది చదవండి: Keerthy Suresh: ఎట్టకేలకు కన్ఫామ్ చేసిన మహానటి కీర్తి సురేష్.. 15 ఏళ్ల నుంచి అంటూ బాయ్ ఫ్రెండ్ తో పోస్ట్!
విడాకుల ప్రకటన అనంతరం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సుదీర్ఘ విచారణ అనంతరం నవంబర్ 27వ తేదీ బుధవారం చెన్నై ఫ్యామిలీ హైకోర్టుకు ధనుష్, ఐశ్వర్యకు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. విడాకులు తీసుకునేందుకు ఇద్దరు అంగీకరించడంతో న్యాయస్థానం తుది తీర్పునిచ్చింది. వారిద్దరూ ఈనెల 21వ తేదీన ఫ్యామిలీ కోర్టులో వ్యక్తిగతంగా విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
విడిపోయినా తల్లిదండ్రులుగా బాధ్యత
ఇక వారి పిల్లలు యాత్ర, లింగ భవిష్యత్ విషయమై ధనుష్, ఐశ్వర్య ఇద్దరు బాధ్యత తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. పిల్లలతో ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ కూడా సమయం గడపాలని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. పిల్లలపరంగా వాళ్లు తల్లిదండ్రులుగా కొనసాగనున్నారు. కోర్టు చెప్పిన షరతులకు ధనుష్, ఐశ్వర్య ఇద్దరు అంగీకరించడంతో విడాకుల ప్రక్రియకు జడ్జి శుభాదేవి ఆమోదం తెలిపినట్లు సమాచారం. వీరికి త్వరగానే విడాకులు మంజూరయ్యే అవకాశం ఉండేది. కానీ వీరిద్దరూ కోర్టు విచారణకు పలుమార్లు గైర్హాజరవడంతో విడాకుల ప్రక్రియ ఆలస్యమైంది. ఎట్టకేలకు విడాకులు మంజూరవడంతో ధనుష్, ఐశ్వర్య చెరో దారి చూసుకున్నారు. అయితే కోర్టు ఎంత భరణం ఇచ్చిందనేది తెలియదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.