Dil Raju Out from Prabhas’s Adipurush Distribution: లాభం ఎక్కడ వస్తుందనుకున్నా అక్కడ వెంటనే దిల్ రాజు వాలిపోతూ ఉంటాడు అనేది సినీ వర్గాల వారు అంటూ ఉంటారు. అంటే ఎక్కడ లాభం వస్తుంది అనుకున్నా ఆయన వదలడు. అయితే ఇప్పుడు ఆయన ఆ లాభాన్ని వదులుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాని దిల్ రాజు నైజాం ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నారు.
కానీ తెలుగు రాష్ట్రాల హక్కులను యువి క్రియేషన్స్ సంస్థ నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టోకున కొనుగోలు చేయడంతో మొత్తం సీన్ అంతా మారిపోయినట్టు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు దాదాపు 185 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో అన్ని ప్రాంతాల వారీగా భారీగా రేట్లు పెంచి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చెబుతున్న రేట్లకు ఆది పురుష్ సినిమాని కొనుగోలు చేయడం రిస్క్ అని భావించి ఆ సినిమాని కొనుగోలు చేయకుండా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
భారీ రేట్లు తాను వెచ్చించలేనని వారికి చెప్పినట్లుగా చెబుతున్నారు. నిజానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సినిమా కొనుగోలు చేసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు 185 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడంతో నైజాం ప్రాంతానికి 60 కోట్లు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి 22 కోట్లు డిమాండ్ చేసిందట. నిజానికి పెద్ద హీరోల సినిమాలకు పెద్ద పెద్ద సినిమాలకు ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఎందుకో దిల్ రాజు అంత మొత్తాన్ని పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
మరోపక్క ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేయబోతున్నారు. తిరుపతిలో రేపు సాయంత్రం చిన్న జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా ఈ వేడుక జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో కాకుండా భద్రాచలంలో నిర్వహిస్తే మరింత బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. కానీ జనాన్ని కంట్రోల్ చేయడం భద్రాచలంలో అయితే కష్టమని అంత భారీ వేదికలు కూడా దొరకవు కాబట్టి తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు
Also Read: Rakul Preet Singh: మాల్దీవుల్లో మంటలు రేపుతున్న రకుల్ ప్రీత్‌సింగ్.. హాట్ ట్రీట్ అంతకుమించి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి