Ganesh Bellamkonda : బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి గణేష్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. అతని అన్న బెల్లంకొండ శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా స్టార్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరకు రాక్షసుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు అతని తమ్ముడు గణేష్ స్వాతి ముత్య అంటూ రాబోతోన్నాడు. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాను ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవ్వాలని ఎదురుచూస్తున్న సమయంలో లక్ష్మణ్ ఈ కథ చెప్పాడట. ఈ కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మి, ఈ కథను సితార వారి దగ్గరకు తీసుకెళ్లగా నాగ వంశీకి కూడా కథ నచ్చిందట. ఇది తమ బ్యానర్ లో చేస్తే మంచి సినిమా అవుతుందని భావించిన ఆయన ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించాడని గణేష్ చెప్పుకొచ్చాడు.
సినిమా అంటే ఖచ్చితంగా పోరాట సన్నివేశాలు ఉండాలని తాను అనుకోనని అన్నాడు.. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎలాంటి జోనర్ సినిమానైనా ఆదరిస్తారు. కథ బాగుండాలి, సినిమా బాగుండాలి అని ఆలోచించాను కానీ ప్రత్యేకంగా ఈ జోనర్ లోనే సినిమా చేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు అంటూ గణేష్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
తన అన్న ఎలాంటి సలహాలు ఇవ్వలేదని, ఇంట్లో వాళ్ళందరూ తాను చేయగలగని నమ్మారని తెలిపాడు. ప్రస్తుతం కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేని అన్నాడు. ఓటీటీలో చూడొచ్చులే అనుకుంటున్నారు. అందుకే తాను కత్తదనం ఉన్న కథ కోసం వెతుకుతుండగా.. లక్ష్మణ్ వచ్చి ఈ కథ చెప్పాడట. ఈ కథలో వైవిద్యం ఉందని, ఇది ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మి ఈ సినిమా చేయడం జరిగిందని ధీమా వ్యక్తం చేశాడు.
సినిమా రంగం, సినిమా సెట్ తనకు కొత్త కాదని. ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్న అనుభవం ఉందని చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి సినిమా రంగంలోనే ఉండాలి, ఇక్కడే ఏదోకటి చేయాలని అనుకునేవాడినని చెప్పుకొచ్చాడు. తెర వెనక ప్రొడక్షన్ వ్యవహారాలు అలవాటే గానీ కెమెరా ముందు నటించడం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చాడు. అయితే ముందే నటనలో శిక్షణ తీసుకోవడం, అన్ని విషయాల గురించి తెలుసుకోవడం వల్ల చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని సినిమా అనుభవం గురించి తెలిపాడు.
Also Read : Murali Mohapatra Death Reason: పాటలు పాడుతూనే ప్రముఖ సింగర్ మృతి.. ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook