Game On Movie Songs ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెండ్, యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసి తీస్తోన్న సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఈ క్రమంలోనే దయానంద్ డైరెక్షన్‌లో రవి కస్తూరి గేమ్ ఆన్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాబోతోన్న ఈ సినిమాలో గీత్ ఆనంద్, నేహా సోలంకిలు హీరో హీరోయిన్లుగా నటించారు.
తాజాగా ఈ చిత్రం నుంచి రిచో రిచ్ అనే పాటను రిలీజ్ చేశారు. దా చిన్న కూర్చో నీకో కథ చెపుతా అంటూ సాగే ఈ పాట యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతానికి ఈ పాట అయితే యూట్యూబ్‌లో అందరినీ మెప్పిస్తోంది. మంచి వ్యూస్‌తో ఈ పాట దూసుకుపోతోంది. ఈ పాటకు అసుర ఇచ్చిన లిరిక్స్ క్యాచీగా ఉండగా.. అసుర, రిక్కీల గానం కొత్త ఫీల్‌ను తెచ్చింది.
పాటను రిలీజ్ చేసిన అనంతరం నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. ‘గేమ్ ఆన్’ టైటిల్ అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ ఫేమస్ నవాబ్ గ్యాంగ్ బ్యాండ్ ద్వారా మ్యూజిక్ ను ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నామని తెలిపాడు. ఈ రిచో రిచ్ సాంగ్‌ను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.
డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ.. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ అని పేర్కొన్నాడు. తెలుగులో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు రావడమే కాదని, అవి ఎక్కువ శాతం సక్సెస్ కూడా అవుతున్నాయని తెలిపాడు. ఆ కోవలోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. కథను నమ్మి సినిమా చెయ్యడానికి వచ్చిన నిర్మాతకు థాంక్స్ తెలిపాడు.
నిర్మాత ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా ఎంతో యాక్టీవ్‌గా ప్రతి విషయంలో అప్డేట్‌లో ఉంటాడని, ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలని చెప్పుకొచ్చాడు. తన బ్రదర్ పై నమ్మకం పెట్టి ఈ కథ రాసుకుని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
Also Read: Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు
Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook