Gopichand's Pakka Commercial Movie Review: గోపీచంద్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా మారుతి తెరక్కించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైన వాటి నుంచి ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడేలా చేసుకోవడంలో సఫలమైంది. గోపీచంద్ -మారుతీ కాంబినేషన్ అనగానే కాస్త ప్రేక్షకులలో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడంతో సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంది అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం.
పక్కా కమర్షియల్ కథ
జడ్జి స్థాయిలో ఉన్నా సరే నిజాయితీగానే పనిచేయాలని మనస్తత్వం కలిగిన వ్యక్తి సూర్యనారాయణ(సత్యరాజ్). అన్ని రూల్స్ పాటించి తాను వెలువరించిన తీర్పు వల్ల ఒక అమాయకురాలు ఆత్మహత్య చేసుకున్న బాధతో తన జడ్జి పదవికి రాజీనామా చేసి కిరాణా షాప్ పెట్టుకుంటాడు. తన కొడుకు లక్కీ(గోపీచంద్) తనలా కాకుండా పేదలకు సహాయం పడే విధంగా ఒక మంచి లాయర్ గా ఉండాలని భావించి అతనిని లా చదివిస్తాడు. తండ్రి ఆశయాలకు తగ్గట్టుగానే ఆ కొడుకు కూడా తన దగ్గరకు వచ్చిన వారందరికీ ఫ్రీగా సేవ చేస్తున్నట్లు నటిస్తూ తండ్రికి తెలియకుండా వారి దగ్గర డబ్బులు ఇతర గిఫ్టులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో తన తండ్రి జడ్జి పదవికి రాజీనామా చేయడానికి కారణమైన వివేక్(రావు రమేషూ)తో కలిసి పని చేయడానికి లక్కీ సిద్ధమవుతాడు. తన కొడుకు తనను మోసగించి తప్పుడు పనులు చేస్తూ తప్పుడు వ్యక్తులకు సహాయం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న తండ్రి అతని మీదే యుద్ధం ప్రకటిస్తాడు? ఈ తండ్రి కొడుకులు యుద్ధంలో ఎవరు గెలిచారు? వీరిద్దరి మధ్యలో ఝాన్సీ రాణి(రాశి) పాత్ర ఏమిటి? గేదెలు కాచుకునే వీరయ్య వివేక్ ఎలా అయ్యాడు? అందులో దివాకరం హస్తమేమిటి? చివరికి తండ్రికొడుకులు ఏమవుతారు? అనేదే ఈ సినిమా కదా.
విశ్లేషణ:
ఈ సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికి సినిమా ఏమిటి అనే విషయం మీద దర్శకుడు కొంత క్లారిటీ ఇచ్చేడు. ఆదర్శ భావాలు కలిగిన తండ్రి అలాంటి తండ్రికి పుట్టిన ఒక కమర్షియల్ కొడుకు, తండ్రికి తెలియకుండా అతను డబ్బు సంపాదించే విధానం ఆసక్తికరంగా రాసుకున్నారు. అయితే తండ్రికి తన కొడుకు కమర్షియాలిటీ గురించి తెలియడంతో అతని మీదే యుద్ధం ప్రకటించడం అనే కాన్సెప్ట్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. అలా మొదటి భాగాన్ని పూర్తి చేసిన దర్శకుడు రెండో భాగం అంతా కూడా ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. పూర్తిగా తండ్రికి విరుద్ధంగా పనులు చేస్తూ వచ్చే కొడుకు చివరికి తన తండ్రి ఆశయాన్ని ఎలా సాధించాడు అనే విషయాన్ని కాస్త ఎంటర్టైనింగ్ గా అంతే ఎంగేజింగ్ గా చూపించడానికి దర్శకుడు ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సఫలం అవ్వలేదు అనే చెప్పాలి. ఎక్కడికక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు, అనవసరపు కామెడీ సీన్లతో కాస్త ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే ఒక జడ్జికి సినిమా సీరియల్ కోసం లా చదివిన వ్యక్తి సలహాలు ఇవ్వడం అనేది లాజిక్ కు అందదు. న్యాయంకోసం పోరాడిన కుటుంబ సభ్యులను కోల్పోయిన వ్యక్తులు డబ్బులు కట్టలు చూసి లొంగిపోయినట్లు చూపించడం కూడా లాజిక్కి దూరంగా ఉంది. మొత్తానికి రెండు భాగాలు కూడా లాజిక్ లెస్ గా పూర్తిస్థాయి కామెడీతోనే నింపేసేయడానికి ప్రయత్నించాడు మారుతి. ఆ కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. కానీ రొటీన్ కథను కూడా ఇలా ట్రీట్ చేయొచ్చా అనిపించే విధంగా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. మొత్తానికి చివర్లో ప్రేక్షకులను ఔరా అనిపిస్తాడు.
నటీనటుల విషయానికి వస్తే
లక్కీ అనే లాయర్ పాత్రలో గోపీచంద్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. ఒకపక్క కమర్షియల్ లాయర్ గానే కనిపిస్తూ క్లైమాక్స్ కి వచ్చేసరికి తన తండ్రి ఆశయాన్ని నిలబెట్టడం కోసం తాను పడిన కష్టం అంతా కూడా వివరించే ప్రయత్నం చేస్తాడు. ఇక గోపీచంద్ పాత్ర మలచిన తీరు ఆకట్టుకుంది పూర్తిస్థాయి స్టైలిష్ మేకవర్తో గోపీచంద్ ఆకట్టుకున్నాడు..ప్రతిరోజు పండగే సినిమాలో టిక్ టాక్ స్టార్ గా అలరించిన రాశిఖన్నా ఈ సినిమాలో కూడా దాదాపు అలాంటి పాత్రలోనే మెరిసి ఆకట్టుకుంది. ఆమె పాత్ర మాత్రం కొన్నిసార్లు ఎబ్బెట్టుగా అనిపించక మానదు. ఇక సత్యరాజ్, రావు రమేష్ పోటాపోటీగా నటించి తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. అజయ్ ఘోష్ నటన కూడా సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. మొదట్లో సినిమా హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్ర శుక్ల చాలా చిన్న పాత్రలో మెరిసింది.. ఇక సియా గౌతమ్ కూడా కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి వంటి వారికి మంచి రోల్స్ దొరికాయి. కనిపించింది ఒకటి రెండు సీన్లలో అయినా చమ్మక్ చంద్ర, వేణు, శ్రీనివాసరెడ్డి తమదైన శైలిలో హాస్యం పండించారు.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే
సంగీతం అందించిన జేక్స్ బిజాయ్ పాటలు అన్నీ ఆకట్టుకోకపోయినా కొన్ని మాత్రం ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉన్నాయి. ఇక ఎడిటింగ్ మీద మరికొంత దృష్టి పెడితే బాగుండు అనిపిస్తుంది. కెమెరా పనితనం సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. గీతా ప్రొడక్షన్ వ్యాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒక్క మాటలో
ఒక్క మాటలో చెప్పాలంటే 'పక్కా కమర్షియల్' - ఒక 'పక్కా రొటీన్ కమర్షియల్' మూవీ.
రేటింగ్: 2.5/5
నటీనటులు: గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, అజయ్ ఘోష్, ప్రవీణ్ తదితరులు
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: 'బన్నీ' వాసు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మారుతి
సినిమాటోగ్రఫీ: కర్మ్ చావ్లా
సంగీతం: జేక్స్ బిజాయ్
Also Read :Malavika Mohanan Pics: బాబోయ్ మాళవిక మోహనన్.. అందాలన్నీ చూపిస్తూ చంపేస్తుందిగా!
Also Read :Ruhani Sharma Pics: రుహానీ శర్మ అందాల జాతర.. ఇట్స్ వెరీ హాట్ గురూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook