R.Madhavan Home Tour: సౌత్ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుని ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మరింత బిజీగా మారిన మాధవన్, ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం వైవిధ్య భరితమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును అనేక రంగాలలో పెట్టుబడులుగా పెడుతూ భారీగా ఆర్జిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్త ఇంటికి యజమాని అయ్యాడు మాధవన్.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ముంబైలోని అత్యంత ఖరీదైన ఏరియాలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారట. దీని ధర సుమారుగా రూ. 17.5 కోట్లని తెలుస్తోంది. త్వరలోనే ఈ కొత్త ఇంటికి ఫ్యామిలీతో సహా షిఫ్ట్ కాబోతున్నారట. ఇకపోతే ఈ కొత్త ఇంటి విషయానికి వస్తే, ఈ హీరో తీసుకున్న ఈ కొత్త ఇల్లు 4,182 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది..అలాగే రెండు విశాలమైన పార్కింగ్ స్థలాలతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయట. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హోటల్లో విలాసవంతమైనది అని తెలుస్తోంది. ప్రస్తుతం నార్త్, సౌత్ ఇండస్ట్రీలలో తనదైన నటనతో ముద్ర వేసుకున్న ఈయన ఇప్పుడు ఇలా ఖరీదైన బంగ్లాలను సొంతం చేసుకుంటూ ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం మాధవన్ సినిమాల విషయానికొస్తే.. తాజాగా అజయ్ దేవగన్, జ్యోతిక , జానకి బోడివాలా కాంబినేషన్లో వచ్చిన చిత్రం సైతాన్. ఇందులో మాధవన్ విలన్ గా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.149 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. హారర్ ప్రేమికులకు ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ అందించిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఈ సినిమా విజయంతో ఈయన చేతిలో మరో ఐదు సినిమాలు వచ్చి చేరాయి. ఇక ఆ సినిమాలన్నింటిలో కూడా పాల్గొంటూ బిజీబిజీగా గడిపేస్తున్నారు మాధవన్ . ఇలా ఒకవైపు నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తనలోని టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇక మరి మాధవన్ రాబోయే చిత్రాలతో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారరో చూడాలి.
Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి