Hyper Aadi apology video: హైపర్ ఆది సారీ చెప్పాడు..

Hyper Aadi releases apology video: హైదరాబాద్: హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కించపరిచేలా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో ఓ స్కిట్ ప్రదర్శించాడని అతడిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇటీవల ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2021, 06:25 AM IST
Hyper Aadi apology video: హైపర్ ఆది సారీ చెప్పాడు..

Hyper Aadi releases apology video: హైదరాబాద్: హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కించపరిచేలా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో ఓ స్కిట్ ప్రదర్శించాడని అతడిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇటీవల ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన హైపర్ ఆదితో పాటు ఆ స్కిట్ రాసిన రచయిత, ఆ షో నిర్వాహకులు మల్లెమాల యూనిట్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ తమ ఫిర్యాదులో పేర్కొంది. 

హైపర్ ఆదిపై ఫిర్యాదు (Complaint filed against Hyper Aadi) అనంతరం ఈ వివాదం పెద్దది కావడం, తెలంగాణ సంస్కృతిని కించపరిస్తే ఊరుకునేది లేదని సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించాడు. తమ స్కిట్ కారణంగా నొచ్చుకున్న వాళ్లకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేసిన హైపర్ ఆది... '' ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడు ఉండవు'' అని అందులో వివరణ ఇచ్చాడు. 

Watch video here: హైపర్ ఆది సారీ చెప్పిన వీడియో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వీడియోలో హైపర్ ఆది (Hyper Aadi apology video) మాట్లాడుతూ.. ''అన్ని ప్రాంతాల వాళ్లం ఎంతో సరదాగా కలిసిమెలిసి పని చేసుకుంటూ ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకుంటుంటాం. శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన స్కిట్‌పై (Complaint on Hyper Aadi over his skit in Sridevi drama company) కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ.. అవి మేము ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు. అన్ని ప్రాంతాల వారి ప్రేమాభిమానాల వల్లనే మేము వారిని ఇంతలా ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతున్నాం. ఏది ఏమైనా ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జరిగిన దానికి అందరి తరపున క్షమాపణ కోరుతున్నా'' అని పేర్కొన్నాడు.

Also read: Vijay Sethupathi, Jr Ntr: ఎన్టీఆర్ సినిమాలో విజయ్ సేతుపతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News