Mike Tyson sensational comments on Vijay Deverakondas Liger Movie: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ 'లైగర్' సినిమాలో చేయటం భారతదేశంలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో తన పాత్ర గురించి మైక్ టైసన్‌కు ఎలాంటి అవగాహన లేదట. ఓ పాడ్‌కాస్ట్ రికార్డింగ్ సందర్భంగా రికార్డ్ చేసిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. హాట్ బాక్సిన్ విత్ మైక్ టైసన్ కార్యక్రమంలో ఈ ప్రఖ్యాత బాక్సర్ ఎలాంటి దాపరికాలు లేకుండా సంభాషించారు.
మైక్ టైసన్‌ను బాలీవుడ్ చిత్రం లైగర్‌లో మీ పాత్ర గురించి చెప్పండి అని ఓ స్నేహితుడు అడిగాడు. 'మీరు మళ్లీ కామెడీ సినిమాల్లోకి వస్తున్నారని విన్నాను?' అని అడిగాడు. అదేమీ నాకు తెలియదు అంటూ ఆశ్చర్యంగా టైసన్ సమాధానం చెప్పాడు. అవునా. ఆ పాత్ర గురించి నాకు చెప్పు, నాకు దాని గురించి వివరించు అంటూ ఎదురు ప్రశ్నించాడు. దాంతో టైసన్ భారతదేశంలో ఏ సినిమా చేయబోతున్నాడని తెలుసుకునేందుకు వారంతా లైగర్ చిత్రం గురించి గూగుల్ చేస్తారు.
'లైగర్ అంటే ఏంటి?'అని ఒకరు అడగ్గానే.. మైక్ టైసన్ వివరిస్తూ... లైగర్ అంటే జంతువు జీవసంబంధమైన మూలాలను వివరిస్తుందని, అది పులి, టైగర్‌లకు పుట్టే సంకరజాతి జంతువు అని అంటారు. అలా సాగే చర్చ బీస్ట్ (మృగం) వైపు మళ్లుతుంది. లైగర్ భౌతికంగా ఎలాంటి లక్షణాలతో ఉంటుంది.. సామాజికంగా ఎలా ఉంటుంది.. అంటూ చర్చ సాగుతుంది. టైసన్ స్నేహితుల్లో ఒకరు.. నేను లైగర్‌ను కొట్టగలనా అంటూ ఆశ్చర్యపోతాడు. అలాంటి ఆలోచన చేయొద్దు, అవకాశమే లేదు అంటూ టైసన్ సమాధానమిస్తాడు. 'అది నిన్ను చంపడానికి రెండు సెకన్లు పడుతుంది. సింహం కూడా అంత వేగంగా ఉండదు' అంటూ టైసన్.. లైగర్ తెగకు సంబంధించిన ఓ వీడియోను చూస్తూ అనుగుణంగా రన్నింగ్ కామెంటరీ చేశాడు. టైసన్ వద్ద పెంపుడు జంతువులుగా పులులు ఉండటం విశేషం.
అలా తిరిగి లైగర్ సినిమాపై చర్చకి తిరిగి రావడానికి ఒక నిమిషం సమయం పట్టింది. అలా వారందరూ సినిమా ట్రైలర్‌ని చూడాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికి ఆ చిత్రం టీజర్ రాలేదు. లైగర్ మొదటి టీజర్ డిసెంబర్ 2021 వరకు రాలేదు. దీంతో వారు అభిమానులు రూపొందించిన ట్రైలర్‌ను చూశారు. అది ఫేక్ టీజర్ అని గ్రహించేందుకు కొంత సమయం పడుతుంది. టైసన్, అతని స్నేహితులు లైగర్.. ఓ లో-బడ్జెట్ హాలీవుడ్ స్టోనర్ సినిమాలా కనిపిస్తోందన్నారు.
పాడ్‌కాస్ట్ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రారంభ రోజులలో జరిగింది. మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ టైసన్ గతేడాది నవంబర్‌లో లైగర్ సెట్స్‌లో చేరారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండేలతో కలిసి చిత్రీకరణలో పాల్గొన్నారు. చిత్ర నిర్మాతలు టైసన్‌తో లాస్‌వెగాస్‌లో చిత్రీకరించినప్పటి మేకింగ్ వీడియోను విడుదల చేశారు. బాక్సింగ్ లెజెండ్, విజయ్ దేవరకొండపై అమితమైన ప్రేమ చూపడం విడియోలో చూడొచ్చు. లైగర్ ఈ గురువారం విడుదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల నుండి నెగటివ్ టాక్ దక్కించుకుంది. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి.
Also Read: పాకిస్తాన్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డును అందుకోనున్న విరాట్ కోహ్లీ! రెండో ప్లేయర్‌గా చరిత్ర
Also Read: కోబ్రా ట్రైలర్ వచ్చేసింది.. 'అపరిచితుడి'ని మించిపోయిందిగా! తళుక్కుమన్న క్రికెటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook