Vishwambhara Inside Talk: చిరంజీవి భోళా శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ తర్వాత తన తదుపరి చిత్రాల కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.. అందుకే చాలా గ్యాప్ ఇచ్చి మరీ డైరెక్టర్ వశిష్ట తో విశ్వంభర సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సినిమా సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. UV బ్యానర్ పైన భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తూ ఉన్న ఈ సినిమాని వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం చేత అలాగే తన కుమారుడు నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల అవుతుండడంతో ఈ సినిమాని వాయిదా వేశారు.
దీంతో విశ్వంభర చిత్రం వేసవిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.. కానీ టీజర్ విడుదలైనప్పుడు ఈ టీజర్ పైన కొంతమేరకు నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయ్యింది. దీంతో చిరంజీవి కూడా డైరెక్టర్ పైన కూడా ఫైర్ అయ్యారని, గ్రాఫిక్స్ విషయంలో మళ్ళీ రీ షూటింగ్ చేయమన్నారని కూడా వార్తలు వినిపించాయి. దీంతో VFX భయం చిరంజీవికి పట్టుకున్నట్లు కనిపిస్తోంది.. టీజర్ లో చేసిన తప్పులను సైతం సినిమాలో చేయకుండా ఉండాలని హెచ్చరించారట.
ఎందుకంటే గతంలో కూడా ప్రభాస్ నటించిన అదిపురుష్ సినిమా సమయంలో కూడా VFX సరిగ్గా లేకపోవడంతో చాలా వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా వినిపించడంతో అభిమానులే ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఇందులో కనిపించిన పాత్రలు కార్టూన్ పాత్రల లాగా కనిపించడంతో చాలామందికి నచ్చలేదు.. అలా ఇప్పుడు విశ్వంభర సినిమాలో కూడా అలాంటి పరిస్థితి ఎదురు అవడంతో విశ్వంభర టీమ్ మొత్తానికి కూడా అదే భయం పట్టుకుందట.
ఇక మెగా అభిమానులు కూడా విశ్వంభర సినిమా పరిస్థితి కూడా VFX ప్రజెంటేషన్ విషయంలో సరిగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ట్రైలర్ సమయానికి విఎఫ్ఎక్స్ కరెక్ట్ గా సెట్ చేసుకుంటేనే హైపొస్తుంది. లేకపోతే ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగులుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.