Kobali: ‘కోబలి’ ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న కోబలి.. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ రావడం పట్ల నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోడూరు గ్రామానికి చెందిన తిరుపతి శ్రీనివాసరావు టిఎస్ఆర్ అనే బ్యానర్ ను పై గతంలో ‘తికమకతాండ’అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో ఆయన ఇద్దరు కొడుకులను హీరోలుగా పరిచయం చేసారు. తికమకతాండ రెండు తెలుగు రాష్ట్రాల్లో 130కి పైగా థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ‘తికమకతాండ’ థియేట్రికల్ గానే కాకుండా.. ఆహా ఓటీటీలోను మంచి సక్సెస్ అయింది.
ఫస్ట్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ‘కోబలి’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ సిరీస్ వరల్డ్ వైడ్ గా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు ఈ సిరీస్ కంటెంట్ యూనివర్సల్ అప్పీల్ ఉండటంతో అన్ని భాషల వాళ్లు ఈ సిరీస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వీటిలో తెలుగు , హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడ , బెంగాలీ , మరాఠీ భాషల్లో డిస్నీ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
‘కోబలి’ సిరీస్ లో రవి ప్రకాష్, రాకీ సింగ్, తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు. ఫ్యాక్షన్ డ్రాప్ లో రివెంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. డిస్నీ ప్లస్ లో ఇలాంటి కంటెంట్ ఇంతకు ముందు చూడలేదన్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అందరినీ అలరిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రివెంజ్ డ్రామాలోని ఇంటెన్స్ కు ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాయి. రేవంత్ లెవక డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ తో ఇన్నాళ్లూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కనిపించిన రవి ప్రకాష్ మెయిన్ లీడ్ కు వచ్చి మంచి నటన కనబరిచాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో అతని యాక్టింగ్ అందరు మంచి అప్లాజ్ ఇస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాల్లో రివెంజ్ అనేది కామన్ గానే ఉన్నా.. ఈ సిరీస్ లోని రివెంజ్ కు సంబంధించిన ప్లాట్ సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులు సరికొత్తగా థ్రిల్ ఫీలవుతున్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.