Man harassed Tollywood Actress: టాలీవుడ్ ప్రముఖ నటి ఒకరిని ఓ ప్రబుద్ధుడు ఫోన్ ద్వారా వేధింపులకు గురిచేశాడు. ఓ యాప్ ద్వారా ఆమె ఫోన్ నంబర్ తెలుసుకున్న అతను... అప్పటినుంచి అసభ్య మెసేజ్‌లతో వేధిస్తున్నాడు. ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చాడు. తాను చెప్పినట్లు వినాలంటూ హుకుం జారీ చేశాడు.
వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో ఆ నటి షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. షీ టీమ్స్ అతని కదలికలపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించగా... అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వేధింపులకు గురైన నటి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.
మార్చి, ఏప్రిల్ నెలల్లో షీ టీమ్స్‌కు 355 ఫిర్యాదులు :
సైబరాబాద్ షీ టీమ్స్‌కు ఈ ఏఢాది మార్చి, ఏప్రిల్ నెలల్లో మొత్తం 355 ఫిర్యాదులు అందినట్లు డీసీపీ అనసూయ తెలిపారు. ఇందులో వాట్సాప్ ద్వారా 269 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదుల్లో ఫోన్ వేధింపుల కేసులు 141 ఉన్నాయన్నారు. 81 కేసుల్లో 18 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని... 119 మందిని పద్దతి మార్చుకోవాల్సిందిగా మందలించామని చెప్పారు.
మరో 319 మంది ఆకతాయిలకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు డీసీపీ అనసూయ తెలిపారు. వీరిలో 98 మంది మైనర్లు కాగా... 19-24 ఏళ్ల వయసు వారు 112, 25-35 ఏళ్ల వయసు వారు 92, 36-50 ఏళ్ల వయసువారు 17 మంది ఉన్నట్లు చెప్పారు. మరోసారి ఇలాంటివి రిపీట్ కావొద్దని వారిని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. గడిచిన 2 నెలల వ్యవధిలో మొత్తం 1003 డెకాయ్ ఆపరేషన్స్, 834 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేయాలకునే మహిలలు వాట్సాప్ నంబర్ 9490617444 లేదా 100కి డయల్ చేయాలని సూచించారు.
Also Read: Horoscope Today May 8 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు
Also Read: HDFC Interest Rate: లోన్స్ తీసుకునేవారికి నిరాశే, హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.