Manchu Lakshmi: నా కుటుంబమే నాకు అడ్డు.. తండ్రి పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు లక్ష్మి.

Manchu Lakshmi Movies: మంచు మోహన్ బాబు కూతురిగా.. మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే తనకి ఆఫర్లు రాకపోవడానికి.. తన కుటుంబమే తనకి అడ్డు అని షాకింగ్ కామెంట్స్ చేసింది లక్ష్మి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 21, 2024, 07:23 PM IST
Manchu Lakshmi: నా కుటుంబమే నాకు అడ్డు.. తండ్రి పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు లక్ష్మి.

Manchu Lakshmi comments: మంచు మోహన్ బాబు.. ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా..సినిమాలు మాత్రం చేసింది కానీ పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఈ మధ్యనే మంచు లక్ష్మి మాన్స్టర్, మరంతేన్ మన్నితేన్ అనే సినిమాలలో కనిపించింది. 

తాజాగా ఓక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మంచు లక్ష్మీ తన కెరియర్లో తాను ఎదుర్కొన్న అడ్డంకుల గురించి మాట్లాడుతూ.. కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. తన కుటుంబమే తనకు అడ్డు అని.. మంచు లక్ష్మి చెప్పటం అందరికీ షాక్ ఇచ్చింది. 

ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, తన అనుభవాల గురించి ఇంటర్వ్యూలో పంచుకుంది మంచు లక్ష్మి. హైదరాబాదులో ఉన్నప్పుడు.. ఆఫర్లు రావడం లేదని ముంబైకి.. షిఫ్ట్ అవుదామని..అనుకుందట. కానీ దానికి తన కుటుంబ సభ్యులు అసలు ఒప్పుకోలేదని, వాళ్ళే అడ్డు వచ్చారని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

"నా కుటుంబమే నాకు ఉన్న ఒకే ఒక్క అడ్డు. నన్ను దూరంగా పంపడానికి వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. మేము చాలా క్లోజ్ గా ఉంటాము. ఒక పెద్ద చెరువులో కెళ్ళి చిన్న చేప లాగా ఉండాల్సిన అవసరం నీకు ఏముంది అంటూ.. వాళ్ళు నన్ను ఆపేసే వాళ్ళు. వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉన్నాయి. అందుకే నేను నాకు మంచి స్నేహితురాలు అయిన రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. తను కూడా నన్ను ముంబై షిఫ్ట్ అవమని ఎంకరేజ్ చేసేది" అని చెప్పింది మంచు లక్ష్మి.

అంతేకాకుండా ఒకసారి తనకి మంచి స్నేహితుడు అయిన.. రానా దగ్గుబాటి తో మాట్లాడుతున్నప్పుడు.. తను కూడా ముంబై వస్తే మంచి ఆఫర్లు వస్తాయని తనని మోటివేట్ చేసినట్లుగా చెప్పింది మంచు లక్ష్మి. తన ఇద్దరు సోదరుల కంటే ఇండస్ట్రీలో తానే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దానికి కారణం తను ఒక ఆడపిల్ల అయిపోవడం అని చెప్పింది. 

కేవలం సౌత్ ఇండియా ఇండస్ట్రీలో మాత్రమే కాక.. దేశవ్యాప్తంగా మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని కామెంట్స్ చేసింది మంచు లక్ష్మి. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి..

సినిమాల పరంగా చూస్తే.. మంచు లక్ష్మి ఆఖరి సారిగా మాన్స్టర్ అనే సినిమాలో కనిపించింది. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆ సినిమాతో.. మంచు లక్ష్మి మలయాళం లో కూడా అడుగు పెట్టింది. ఇక ఎట్టకేలకి తన కుటుంబ సభ్యులను ఒప్పించి గత ఏడాది మంచి ఆఫర్ల కోసం ముంబైకి షిఫ్ట్ అయింది. మరి ముంబై షిఫ్ట్ అయ్యాక ఆమె కెరియర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News