Meera Jasmine Father Died: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. నటి మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిప్ తీవ్ర అస్వస్థతతో ఈ రోజు కేరళలోని ఎర్నాకులంలో కన్నుమూశారు. జోసెఫ్, అలియమ్మ దంపతుకు ఐదుగురు సంతానంలో మీరా జాస్మిన్ చిన్నవారు. ఈమె తెలుగులో పందెం కోడి, గోరింటాకు, బంగారు బాబు, మహారథి, భద్ర, గుడుంబా శంకర్ వంటి అగ్ర హీరోల చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 50పైగా సినిమాల్లో నటించింది. మీరా జాస్మిన్ 2003లో మలయాళ చిత్రం 'పాదమ్ ఒన్ను ఓరు విలాపం' చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది. చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన మీరా జాస్మిన్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. చివరగా ఈమె 'మోక్ష' చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత చాలా యేళ్లు సముద్రఖని ముఖ్యపాత్రలో నటించిన 'విమానం' సినిమాలో కీ రోల్ పోషించింది.
సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన తర్వాత 2014లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తోన్న అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. బోయపాటి శ్రీను తొలి చిత్రం 'భద్ర' మూవీలో నటించింది. అటు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'గుడుంబా శంకర్' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు బాలకృష్ణ హీరోగా నటించిన 'మహారథి'లో మెరిసింది. రీసెంట్గా విమానం సినిమాతో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. అంతేకాదు అవకాశాల కోసం వరుస ఫోటో షూట్స్ చేస్తోంది.
Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook