Minute Number of theatres for Ajiths Thunivu in Telugu States: అజిత్ హీరోగా తునివు అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. హెచ్ వినోద్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాలో మంజు వారియర్, జాన్ కొక్కెన్, మహానది శంకర్, సముద్రఖని లాంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో కూడా తెగింపు అనే పేరుతో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాని తెలుగులో మూడు కోట్ల రూపాయల మీద హక్కులు చెల్లించి మరీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుంచి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క వారసుడు అనే సినిమాతో దిల్ రాజు కూడా గట్టి ప్లానే చేశారు.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో విజయ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తునివు సినిమాకి థియేటర్లు దక్కించుకోవడం చాలా కష్టంగా మారిందని తెలుస్తోంది. సినిమా తెలుగులో విడుదలవుతున్న సరే చాలా అత్యల్ప స్క్రీన్స్ మాత్రమే సినిమాకు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమాకు మంచి మౌత్ టాక్ కనుక వస్తే అప్పుడు పండుగ వారం తర్వాత అయినా సినిమాకి థియేటర్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది.
బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు పెద్ద ఎత్తున థియేటర్లు అవసరమవుతాయి. అయినా సరే రెండిటి కంటే ఎక్కువగా వారసుడు సినిమాకి థియేటర్లు దక్కించుకునేందుకు దిల్ రాజు అయితే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో తునివు పరిస్థితి చాలా దారుణంగా తయారైందని తెలుస్తోంది. మరో సినిమా రిలీజ్ చేస్తోంది ఈ నేపథ్యంలో తునివు సినిమాకు థియేటర్లు దొరక్క పోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: Mohan Babu : పోలీసులు అధికారంలో ఉన్నవారికి తొత్తులు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!
Also Read: Pushpa Russia Release: 'పుష్ప' భజన మాములుగా లేదు కానీ.. మూడు కోట్లు లాసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.