Naatu Naatu Won Oscar 2023: నాటు నాటు పాట ప్రపంచ మొత్తాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. నాటు నాటు స్టెప్పులను వేసేందుకు అందరూ ప్రయత్నించారు. ఇక నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లడంతో అంతా నోరెళ్లబెట్టేశారు. ఇప్పుడు ఏకంగా నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును ఇంటికి పట్టుకొచ్చేసింది. నాటు నాటు పాటకు ఆస్కార్ ప్రకటించిన అనంతరం కీరవాణి, చంద్రబోస్‌లు స్టేజ్ మీదకు వెళ్లారు.
చంద్రబోస్ ఏమీ మాట్లాడలేదు గానీ కీరవాణి తన స్టైల్లో ప్రసంగం ఇచ్చాడు. తన ఆనందాన్ని పాట రూపంలో వ్యక్తీకరించాడు. రాజమౌళి పేరు ఎత్తాడు.. థాంక్స్ టు కార్తీకేయ అన్నాడు. అంతే గానీ హీరోల పేర్లు ఎక్కడా ఎత్తలేదు. కనీసం పాట పాడి మెప్పించిన సింగర్ల పేర్లు కూడా ఎక్కడా ఎత్తలేదు.
అయితే కీరవాణి రాజమౌళి పేరు ఎత్తడం వరకు ఓకే గానీ నిర్మించిన నిర్మాత దానయ్య పేరు మాత్రం ఇంత వరకు ఎక్కడా ఎత్తకపోవడం విస్మయం కలిగిస్తుంది. అసలు ఇంత వరకు దానయ్య పేరు ఏ స్టేజ్ మీద కూడా రాజమౌళి సైతం చెప్పలేదు. ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి అన్నట్టుగానే ఉంది. ఇక మధ్యలో ఈ కార్తికేయ అయితే ఎక్కడికి వెళ్లినా వారితోనే ఉంటాడు.
గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్లోనే వీరే మెరిశారు. అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడు మాత్రం కీరవాణి సింగర్లను గుర్తు పెట్టుకున్నాడు. వారి పేర్లను చెప్పి.. వారికి థాంక్స్ కూడా చెప్పాడు. కానీ ఈ ఆస్కార్ వేదిక మీద మాత్రం వారిద్దరి పేర్లు మరిచిపోయాడు. కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సైతం చీకట్లోనే ఉన్నాడు. ఇలా ఆస్కార్ ఎవరికి వచ్చింది.. ఎందుకు వచ్చింది? ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనే విషయంలో నెటిజన్లకు సైతం స్పష్టత రావడం లేదు.
మొత్తానికి నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఇదే కాకుండా ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమాకు కూడా అవార్డు వచ్చింది. అలా రెండు ఆస్కార్ అవార్డు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇండియన్ మూవీ ఇండస్ట్రీ.
Also Read: Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు
Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook