Custody worldwide pre release business: నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం కస్టడీ. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఈ సినిమా రేపు శుక్రవారం నాడు తెలుగు సహా తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి.
నిజానికి ఈ సినిమా హిట్ కావడం అటు నాగచైతన్య మొదలు సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు సినిమా నిర్మాత శ్రీ శ్రీనివాస చిట్టూరి అదేవిధంగా హీరోయిన్ కృతి శెట్టి ఇలా అందరికీ అవసరమే. నిజానికి ఈ సినిమా విడుదల రేపే అయినా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే పెద్దగా నమోదు అయితే కాలేదు. నిజానికి సినిమా వర్గాల వారు చెబుతున్న దాని ప్రకారం సినిమా బాగా కుదిరిందని మంచి రిపోర్ట్స్ కూడా వచ్చాయని అంటున్నారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే హైలైట్ అని సినిమాలో వచ్చే ట్విస్టులు యాక్షన్ సీక్వెన్స్ లు బాగా ఉంటాయని అంటున్నారు.
Also Read: Janhvi Kapoor Telugu Films: మరో రెండు తెలుగు సినిమాలలో జాన్వీ కపూర్.. ఫ్లాఫ్ హీరోకు జతగా!
ఈ మధ్యనే కస్టడీ స్పెషల్ ప్రీమియర్ షో సినీ పరిశ్రమలో కొందరికి చూపించగా దాని నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే దాదాపు 21 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా నైజాం ప్రాంతంలో ఏడు కోట్లు ప్రాంతంలో రెండున్నర కోట్లు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో రెండు కోట్ల 16 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లా కోటి నాలుగు లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లా కోటి రెండు లక్షలు, గుంటూరు జిల్లా కోటిన్నర కృష్ణా జిల్లా కోటి నాలుగు లక్షలు, నెల్లూరు జిల్లా 75 లక్షలు వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల 71 లక్షలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
మిగతా భారతదేశం అంతా కోటి 35 లక్షలకు బిజినెస్ జరిగితే ఓవర్సీస్ లో రెండు కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 21 కోట్లకు తెలుగు వర్షన్ హక్కులు అమ్ముడు అయ్యాయి. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటించగా అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook