Naga Chaitanya about Akhil : టాలీవుడ్ లో అక్కినేని హీరోగా పేరుపొందిన నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం తండేల్. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్నది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య, సాయి పల్లవి ఎన్నో తెలియని విషయాలను కూడా పంచుకోవడం జరిగింది. అలా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ నాగచైతన్యను ఇలా అడుగుతూ.. సాయి పల్లవి లవ్ స్టోరీ లో బాగా యాక్ట్ చేశారా? తండేల్ సినిమాలో యాక్ట్ చేశారా? అని అడగగా..
Naga Chaitanya about Multi Starter; నాగచైతన్య సమాధానం చెబుతూ ఉండగానే.. మధ్యలో కట్ చేసి.. మీకు మరొక ఆప్షన్ ఉంది.. మల్టీ స్టారర్ చేయవలసి వస్తే ఏ హీరోతో చేయగలరు అనే విధంగా రెండు ఆప్షన్లను కల్పించింది ఆ యాంకర్. అందులో ఒకరు అఖిల్ కాగా మరొకరు అల్లు అర్జున్ అని అడిగగా.. అయితే ఈ విషయం పైన నాగచైతన్య మాట్లాడుతూ.. అఖిల్ తో మనం సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. కాబట్టి కచ్చితంగా అల్లు అర్జున్ తోనే తాను మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తానని తెలియజేశారు. మొత్తం పైన అఖిల్ కన్నా తాను అల్లు అర్జున్తో మళ్టిసారి చేయదనే బెటర్ అని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
అయితే ఈ విషయం విన్న సాధారణ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్న.. అక్కినేని అభిమానులు మాత్రం హర్ట్ అవుతున్నారు. అన్న తమ్ముళ్లు ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై ఫుల్ లెంత్ స్టోరీలో చూడాలనుకుంటున్నామని.. వారి భావన వ్యక్తం చేస్తున్నారు.
మరొకవైపు నాగచైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ విషయంలో సమాధానం చెప్పకుండానే ఇంకొక ప్రశ్న అడగడంతో ఇదెక్కడి యాంకర్ బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇక సమాధానం చెప్పకుండానే ప్రశ్నల వర్షం కురిపిస్తే ఎలా.. వారికి కొంచెం గ్యాప్ ఇవ్వు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. తండేల్ సినిమాకి నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరిస్తూ ఉండడంతో.. ఈ సినిమాకి భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఉన్నాయి. మరి ఏ మేరకు అభిమానులు అంచనాలను అందుకొని కలెక్షన్స్ రాబట్టి నాగచైతన్య కెరియర్ లోనే మొట్టమొదటి హైయెస్ట్ కలెక్షన్ గా నిలబడుతుందో చూడాలి.
Read more: Sonu sood: సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ.. అసలు కారణం ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter