Namrata shirodkar sarkaru vaari paata movie : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'కు ప్రీమియర్ షో నుండే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది. సర్కారు వారి పాట వసూళ్లతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు. కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్లు సాధించింది ఈ మూవీ. సర్కారు వారి పాట కథ సామాన్య ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కథ. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐతో ఇబ్బంది పడని మిడిల్ క్లాస్ మనిషి ఉండరు. అలాంటి పాయింట్‌కు మహేష్ బాబు గారి లాంటి సూపర్ స్టార్ ప్లస్ అయ్యాడు.
'సర్కారు వారి పాట'కు పరశురాం దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. తాజాగా హైదరాబాద్ సంధ్య 35ఎంఎంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సందడి చేశారు. సంధ్యలో మ్యాట్నీ షో చూశారు నమ్రత. అభిమానుల సమక్షంలో నమ్రత కేక్ కట్ చేసి సినిమా సక్సెస్‌ను సెలెబ్రేట్ చేశారు.
సర్కారు వారి పాట ఫస్ట్ డే నే కాదు.. ఈ రెండు వారాలు భారీ కలెక్షన్స్ సాధించబోతుందని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ ప్రిమియర్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులన్నీ క్రాస్ చేసింది సర్కారు వారి పాట. అదే స్థాయిలో ఇక్కడ కూడా కలెక్షన్స్ కొనసాగుతున్నాయి.
ట్రైలర్ చూసి ప్రేక్షకులు ఎంత ఎక్సయిటింగా ఫీలయ్యారో.. సినిమా చూసి అంతకంటే ఎక్కువ ఎక్సయిట్ అయ్యారని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన పండగలాంటి సినిమా సర్కారు వారి పాటే అన్నారు. మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటన పరంగా విజృంభించారు. సర్కారు వారి పాట ఊహించినదాని కంటే పెద్ద విజయం సాధించింది.
కరోనా పాండెమిక్ తర్వాత కేవలం రెండు రోజుల్లో వంద కోట్లు వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌ల సరసన నిలిచింది సర్కారు వారి పాట. తొలి రోజు 75.21కోట్లు, రెండో రోజు 27.50కోట్లు వసూలు చేసి కేవలం రెండు చేసింది. మరి కొద్ది రోజుల వరకు పెద్ద సినిమాలేమీ లేవు కాబట్టి ఈ వసూళ్ల పరంపర కొనసాగే అవకాశం ఉంది. సినిమా 250కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంచనాలున్నాయి. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్స్ 35కోట్ల రూపాయలకు అమ్ముడయినట్లు తెలుస్తోంది.
Also Read - Sunil about F3 Movie : అందుకే 'ఎఫ్3'కి మళ్లీ మళ్లీ థియేటర్ వెళ్తారంటున్న సునీల్
Also Read - Eetela Rajender Speech: కేసీఆర్‌ను తన్ని తరిమేసే రోజులు దగ్గరపడ్డాయి: అమిత్ షా సభలో ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.