Unstoppable With NBK: డీజే టిల్లుకు అవమానం.. చెమ్మగిల్లిన బాలయ్య కళ్లు.. అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో

Unstoppable Season 2 Promo: నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్-2 షోతో నాన్‌స్టాప్‌గా దూసుకుపోతున్నారు. మొదటి ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్‌ రాగా.. తాజాగా సెకెండ్ ఎపిసోడ్‌తో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.  

Last Updated : Oct 20, 2022, 04:46 PM IST
  • అన్‌స్టాపబుల్ షోకు గెస్టులుగా సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్
  • ఎమోషనల్‌గా సాగిన సెకెండ్ ప్రోమో
  • నాకు కన్నీళ్లు వస్తున్నాయిః బాలయ్య
Unstoppable With NBK: డీజే టిల్లుకు అవమానం.. చెమ్మగిల్లిన బాలయ్య కళ్లు.. అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో

Unstoppable Season 2 Promo: ఓ వైపు సినిమాలు చేస్తునే.. మరోవైపు అన్‌స్టాపబుల్ సీజన్-2 షోతో నందమూరి బాలకృష్ణ దూసుకుపోతున్నారు. మొదటి ఎపిసోడ్‌కు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గెస్టులుగా రావడంతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్‌తో ఈ ఎపిసోడ్ దూసుకుపోతుంది. బాలయ్యతో చంద్రబాబు, లోకేష్ సంభాషించిన తీరు అటు సినీ వర్గాల్లో.. ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

తాజాగా రెండో ఎపిసోడ్ సెకెండ్ ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ గెస్టులుగా వచ్చారు. ఇప్పటికే ఫస్ట్ ప్రోమో మూవీ లవర్స్‌కు తెగ నచ్చేయగా..రెండో ప్రోమో ఎమోషనల్‌గా కట్ చేశారు. 

జీవితంలో జరిగిన పెద్ద అవమానం ఏంటని డీజే టిల్లు మూవీ హీరో సిద్దును బాలయ్య అడిగారు.  తాను హీరోగా చేద్దామని అనుకుంటున్నానని ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి చెప్తే.. 'ఈ ముఖంతోనే హీరో అయిపోదామని అనుంటున్నావా..?' అని అవమానించారని చెబుతూ సిద్దు ఎమోషనల్ అయ్యాడు. సిద్దు చెబుతున్న మాటలు విన్న బాలయ్య కళ్లు చెమ్మగిల్లాయి. తనకు వస్తున్నాయి కన్నీళ్లు అని ఆయన అన్నారు. 'నువ్వు అక్కడితో ఆపేసి ఇటు రామ్మా' అంటూ సిద్దును గుండెలకు హత్తుకున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News