Nandamuri Thaman: బాలకృష్ణ సినిమా అంతే చాలు మనకు ముందుగా గుర్తొచ్చే పేరు తమన్. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి భారీ చిత్రాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమనే సంగీతాన్ని అందించారు. ప్రతిసారి తన మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నందమూరి అభిమానులైతే తమన్‌ను "ఎస్ఎస్ తమన్" కాకుండా "నందమూరి తమన్" అంటూ ప్రశంసిస్తున్నారు.
ఇక ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూలో ఇదే మాత్రమే బాలయ్య కృష్ణ కూడా చెప్పడం విశేషం. డాకు మహారాజు ప్రమోషన్ ఇంటర్వ్యూలో.. యాంకర్ తమన్ నందమూరి తమన్ అనగా.. బాలకృష్ణ సైతం అదే పదాన్ని మరోసారి చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ చెప్పిన మాట ఇప్పుడు నారా భువనేశ్వరి కూడా అనదం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న విజయవాడలో.. ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా నైట్ నిర్వహించనున్నారు. ఆ రోజు తమన్ టీమ్ మ్యూజికల్ నైట్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం గురించి ప్రెస్ మీట్‌లో భువనేశ్వరి, తమన్ ఇతరులు వివరించారు.
ఈ సందర్భంగా తన ప్రసంగంలో భువనేశ్వరి తమన్ గురించి మాట్లాడుతు, "నందమూరి తమన్" అని వ్యాఖ్యానించారు. ఈ మ్యూజికల్ నైట్ ద్వారా తలసేమియా బాధితుల కోసం నిధులు సేకరించి, మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, తమన్ పేరు గుర్తుకు వచ్చింది, కానీ వెంటనే "సారీ, తమన్ కాదు, నందమూరి తమన్" అని అన్నారు. ఈ మాట వినగానే అక్కడ అందరిలోనూ నవ్వలు వచ్చాయి.
తమన్ సిగ్గుపడి నవ్వుతూ కూర్చున్నారు. ఇక ఆ తర్వాత తమన్ మాట్లాడుతూ..ఈ మంచి కార్యక్రమంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తన ఛారిటీస్ గురించి ప్రస్తావిస్తూ, సినిమాల ద్వారా వచ్చే డబ్బును మాత్రమే తన కోసం ఉపయోగిస్తానని, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు మిగిల్చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం మ్యూజికల్ నైట్ చేయడానికి సిద్ధమయ్యానని తమన్ చెప్పారు.
Also Read: Liquor Shops: ఏపీలో మళ్లీ వైన్స్ దుకాణాలకు దరఖాస్తులు.. అదృష్టం పరీక్షించుకోండి
Also Read: IPS Officers Transfers: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్.. కాకినాడ జిల్లా ఎస్పీ బదిలీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.