Nani 30 Movie Update : కొడుకుతో అప్పుడు.. కూతురితో ఇప్పుడు.. నాని మామూలోడు కాదుగా

Nani 30th Movie Update నాని, మృణాళ్ ఠాకూర్ కాంబోలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దసరా సినిమా ప్రమోషన్స్ సమయంలో నాని తన కొత్త ప్రాజెక్ట్ గురించి స్పందించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 08:09 PM IST
  • వరుస సినిమాలతో నాని సందడి
  • మృణాళ్ ఠాకూర్‌తో నేచురల్ స్టార్
  • క్రిస్మస్‌కు మళ్లీ నాని హల్చల్
Nani 30 Movie Update : కొడుకుతో అప్పుడు.. కూతురితో ఇప్పుడు.. నాని మామూలోడు కాదుగా

Nani 30th Movie Update నాని కథకు ప్రాధాన్యత ఇచ్చే హీరో. ఊరికే హీరోయిజం కోసం బిల్డప్ సీన్లు పెట్టుకుని, ఎలివేషన్లు ఇప్పించుకునే హీరో కాదు. అటు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తూ.. క్లాస్ సినిమాలతోనూ ఆకట్టుకోగలడు. తన నటనతో ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చో పెట్టగలడు. అలాంటి నాని ఇప్పుడు దసరా సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టేశాడు. దసరా సినిమాలో నాని ఎంత రా గా, మాసీగా కనిపించాడో అందరికీ తెలిసిందే.

నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దలైంది. ఇంకా ఈ సినిమా థియేటర్లో ఆడేస్తోంది. నాని ఈ చిత్రంతో తన స్టామినా ఏంటో చూపించినట్టు అయింది. అయితే ఈ సినిమా హిట్టయింది కదా? అని.. మళ్లీ ఇదే జానర్‌లో సినిమాను తీయాలని అనుకోవడం లేదట. తనకు మాస్, క్లాస్ ఆడియెన్స్‌ అందరినీ మెప్పించే చిత్రాలు తీయాలని ఉందట.

 

అందుకే దసరా తరువాత మళ్లీ పూర్తి క్లాస్ సినిమాను తీస్తోన్నట్టుగా చెప్పేశాడు నాని. అందులో ఓ పాపకు తండ్రిలా నటిస్తున్నట్టుగా తెలిపాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇందులో నాని ఓ ఆరేడేళ్ల పాపకు తండ్రిలా నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంతకు ముందు నాని జెర్సీ సినిమాలో ఓ పిల్లాడికి తండ్రిలా నటించాడు. ఆరు ఏడేళ్ల కొడుకుతో జెర్సీ సినిమా తీసి అందరినీ ఏడిపించాడు నాని. ఇప్పుడు కూతురితో కలిసి నాని మెప్పించేందుకు సిద్దమయ్యాడు.

Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్

నాని తన ముప్పవ సినిమాను క్రిస్మస్‌కు రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించాడు. ఈ క్రిస్మస్ మనదే అంటూ శ్యామ్ సింగ రాయ్ సినిమాతో హిట్టు కొట్టేశాడు. మళ్లీ ఇప్పుడు ఈ క్రిస్మస్ మనదే అని తన ముప్పవ సినిమాతో హిట్టు కొట్టబోతోన్నట్టుగా కనిపిస్తోంది. నాని ఇప్పుడు వరుసగా సినిమాలు లైన్లో పెట్టేసిన సంగతి తెలిసిందే. క్లాస్ మాస్ ఆ జానర్ ఈ జానర్ అన్న తేడా లేకుండా నాని అన్ని రకాల సినిమాలను చేస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటూ పోతోన్నాడు. ఇక మృణాళ్ ఠాకూర్ సైతం సీతారామం తరువాత చేస్తోన్న తెలుగు సినిమా ఇదే కావడంతో మరింతగా హైప్ పెరిగింది.

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News