Samuthirakani with Pawan Kalyan కోలీవుడ్ టాప్ యాక్టర్లలో సముద్రఖని కూడా ఒకరు. దర్శకుడిగా, నటుడిగా తమిళంలో సముద్రఖనికి మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సముద్రఖని మెప్పించాడు. ఇప్పుడు దర్శకుడిగానూ సత్తా చాటేందుకు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోగా వినోదయ సిత్తం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు సముద్రఖని. తమిళంలో దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ తెలుగు వర్షన్‌కు కూడా డైరక్షన్ చేశాడు. ఇక నిన్న సముద్రఖని బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విష్ చేశాడు.
ప్రతిభావంతుడైన దర్శకుడు, రచయిత, నటుడు, మా బంగారు గని సముద్రఖనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి అయిన సముద్రఖని మానవ సంబంధాలపై విశ్వాసం ఉన్నవారు. అందుకే ఆయన చిత్రకథల్లో ఆ భావనలు కనిపిస్తాయి. కులరహిత సమాజాన్ని ఆకాంక్షించే వ్యక్తిత్వంతో అటువంటి సమాజం కోసం తపిస్తారు. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు.
🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️…. pic.twitter.com/1czuBzRI5J
— P.samuthirakani (@thondankani) April 27, 2023
నటుడిగా జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. నేను నటించిన 'భీమ్లా నాయక్' చిత్రంలో ఒక ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. శ్రీ మూకాంబికా అమ్మవారి భక్తుడైన సముద్రఖనికి ఆ జగజ్జనని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ విషెస్ అందించాడు.
Also Read: Aham Brahmasmi : మౌనిక కోసం 'అహంబ్రహ్మాస్మి' వదిలేశా.. ఏడాదిన్నర చెన్నైలో.. మంచు మనోజ్ ఎమోషనల్
ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన విషెస్ చూసి సముద్రఖని కరిగిపోయాడు. అన్నయ్యా,నా పట్ల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. మీతో నటుడిగా దర్శకుడిగా ఈ ప్రయాణం ఎన్నో మంచి విషయాలను నేర్పించింది. మరింత గొప్పగా కొనసాగేందుకు కావలసిన ధైర్యాన్ని చైతన్యాన్ని నాలో నింపింది. ముఖ్యంగా సమాజం పట్ల మీకున్న ప్రేమ అక్కర నన్ను మీ వ్యక్తిత్వానికి అభిమానినయ్యేలా చేసింది. సదా మీలాంటి సాహస యోధుడి ఆలోచనలకు దృక్పథానికి సహచరుడినై ఉండాలని కోరుకుంటాను. ప్రజాశ్రేయస్సుకై మీరు కలలుగనే మార్పు సాకారమై, తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతదేశానికి మేలు జరిగే దిశగా ఆ భగవంతుడు మిమ్మల్ని నడిపించాలని మీకు శక్తి ప్రసాదించాలని ప్రార్ధిస్తాను అని సముద్రఖని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.
Also Read: Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్ అబద్దం చెప్పాడా?.. సాయం చేసిన వ్యక్తికి కష్టాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook