Kalki 2898 AD Censor Talk Review: ప్రభాస్ .. బాహుబలి సిరీస్ తర్వాత లాస్ట్ ఇయర్ 'సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్' మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఈ విషయాన్ని ముంబైలో జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. ఈ సినిమా మూడు వింత ప్రపంచాలైన కాశీ, కాంప్లెక్స్, శంబల అనే ప్రపంచాల మధ్య ఏం జరిగిందనేదే 'కల్కి'మూవీ స్టోరీ అని చెబుతున్నారు.
అంతేకాదు ఈ సినిమాలో మహా భారత కాలం నుంచి 6 వేల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. విడుదలకు మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. అంతేకాదు కొన్ని చిన్న చిన్న కట్స్ తో ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా రన్ టైమ్ 180 నిమిషాల 56 సెకండ్స్ ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు ముందుగా ఇది కల్పిత కథ అంటూ వాయిస్ ఓవర్ చెప్పించమని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఇందులో ఏ మతాన్ని కానీ.. కులాన్ని కించపరిచినట్టుగా ఈ సినిమా తెరకెక్కలేదనే విషయాన్ని సినిమాలలో స్లైడ్స్ లో చూపించమన్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రతి సన్నివేశంలో చిత్ర యూనిట్ ను ముప్పతిప్పలు పెట్టినట్టు సమాచారం.
అంతేకాదు మూడు వింత ప్రపంచాల మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సరికొత్తగా ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను సరికొత్త లోకంలో తీసుకెళ్లబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలకు మంచి స్కోప్ ఉంది. అంతేకాదు కథ మొత్తం దీపికా చుట్టు తిరుగుతోందనే సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు యూఎస్ లో రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ అయ్యాయి. ఇప్పటికే 2.5 మిలియన్ యూఎస్ డాలర్స్ ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకు వచ్చేసాయి. మరో ఆరు రోజులు టైమ్ ఉందని కాబట్టి ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాదు తొలి రోజు ఈ సినిమా ఏయే రికార్డులు బ్రేక్ చేయనుందో ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మొత్తంగా గత మూడు నెలలుగా స్థబ్దుగా ఉన్న బాక్సాఫీస్ కు ప్రభాస్ సినిమా కల్కి మంచి జోష్ తెప్పించడం ఖాయమని చెప్పొచ్చు.
Read more: Snakes: వామ్మో..ఇంట్లో బైట పడ్డ 32 పాము పిల్లలు.. షాకింగ్ వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter