Raashi Khanna News: సౌత్ సినీ పరిశ్రమ గురించి షాకింగ్ న్యూస్ ను బయటపెట్టింది హీరోయిన్ రాశీ ఖన్నా. తనను దక్షిణాధి సినీ పరిశ్రమలో గ్యాస్ ట్యాంకర్ అని హేళన చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయిన ఈ భామ.. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే అందులో తన సినీ కెరీర్ లో ఎదుర్కొన్న విమర్శలు ఏంటని అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చింది.
"సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్ల నటనకు స్కోప్ ఉన్న పాత్రలకు అవకాశం లభించింది. ఆ విషయంలో నేను ఎంతో సంతోషించా. కానీ, అదే సమయంలో నా శరీర ఆకృతిపై అనేక విమర్శలు వచ్చాయి. కొద్దిగా లావుగా కనిపించడం వల్ల సౌత్ సినీ ఇండస్ట్రీల్లో నన్ను గ్యాస్ ట్యాంకర్ అని ఎగతాళి చేసేవారు. అప్పటి నుంచి నేను సన్నగా మారాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు నేను అనుకున్నది సాధించాను. నేను చేసే పనికి నాజుకుగా ఉండడం ఎంతో అవసరమని తెలుసుకొని బరువు తగ్గా. అయితే ఆ విమర్శల కోసం నేను సన్నగా మారలేదు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి కామెంట్స్ ఎదురయ్యాయి. కానీ, వాటి వల్ల నేను ఏమాత్రం బాధపడలేదు" అని హీరోయిన్ రాశీ ఖన్నా తెలిపింది.
బాలీవుడ్ వేదికగా 2013లో విడుదలైన చిత్రం 'మద్రాస్ కేఫ్'తో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ రాశీ ఖన్నా. ఆ సినిమా వల్ల ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాకపోయినా.. తెలుగులో 'ఊహలు గుసగుసలాడే' మూవీతో తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది.
ఆ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం వల్ల ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు హిందీలో కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న 'పక్కా కమర్షియల్' మూవీతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.
ALso Read: Varun Tej Political Entry: రాజకీయాల్లోకి రానున్న హీరో వరుణ్ తేజ్.. నాగబాబు క్లారిటీ!
Also Read: Bheemla Nayak OTT: పవన్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. ఒక్కరోజు ముందుగానే ఓటీటీలో రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook