RJ Surya Remuneration per day in Bigg Boss House: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుంచి తాజా ఎపిసోడ్ లో ఆర్జే సూర్య ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఒక ఎఫ్ఎం ఛానల్ ద్వారా ఆర్జేగా పరిచయమైన సూర్య తర్వాత ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో చేరి ఇస్మార్ట్ న్యూస్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా మంచి ఫేమస్ అయ్యాడు. సుమారు 50 మంది సెలబ్రిటీల గొంతుల వరకు అవలీలగా మిమిక్రీ చేసే టాలెంట్ ఉన్న ఆర్జే సూర్య బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు అమ్మాయిలకు దగ్గరవుతూ ప్రేక్షకులకు దూరమయ్యాడు.
వ్యక్తిగతంగా చాలా మంచి వాడైనా సరే టాస్కులలో మంచి పోటీ ఇస్తున్నా సరే అమ్మాయిల విషయంలో ప్రేక్షకులకు మాత్రం అతను నచ్చలేదు. దీంతో ఓటింగ్‌లో అతన్ని వెనక్కి నెట్టేశారు ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా డైరెక్ట్ ఎలిమినేషన్ చేశారు నాగార్జున. శనివారం నాటి ఎపిసోడ్ లో ఆర్జే సూర్యని ఎలిమినేట్ చేయగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో కూడా సూర్య కనిపించబోతున్నారు.
స్టేజ్ మీదకు వచ్చి మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అధికారికంగా హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. ఇక ఈ సందర్భంగా ఆర్జీ సూర్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే విషయం మీద కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఇక మాకు అందుతున్న సమాచారం మేరకు ఆర్జే సూర్య 27,000 ప్రతిరోజూ తీసుకునే వాడట.
ఈ లెక్కన వారానికి 1.89 లక్షలు, ఇన్ని రోజుల పాటు హౌస్ లో ఉన్నందుకు గాను ఆర్జే సూర్య సుమారు 15 లక్షల రూపాయల వరకు వెనకేశాడని అంటున్నారు. వీటిలో టాక్స్ లు పోను మిగతా అమౌంట్ సూర్యకి అందబోతోంది. ఇక ఈ వారం 14 మంది నామినేట్ అవగా ఓటింగ్ వచ్చిన ఆర్డర్ ఈ మేరకు ఉంది. 1. రేవంత్ 2. శ్రీ హన్ 3. ఆదిరెడ్డి 4. బాల ఆదిత్య 5. మరీనా 6. ఇనయ 7. ఫైమా 8. గీతు 9. శ్రీ సత్య 10. కీర్తి 11. రోహిత్ 12. వాసంతి 13. రాజ్ 14. ఆర్జే సూర్య.
Also Read: Halloween stampede: హీరోయిన్ దెబ్బకు 149 మంది మృతి.. వందల మంది ఆసుపత్రి పాలు!
Also Read: Varasudu Business Details: షాకిస్తున్న వారసుడు బిజినెస్ డీటైల్స్.. ఎన్ని కోట్లకు అమ్మారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook