Sammathame Trailer: లారీలైనా గుద్దితే తిరిగి చూస్తాయేమో గానీ.. ఈ అమ్మాయిలు తిరిగిచూసేలా లేరు!

Sammathame movie Trailer released. స‌మ్మ‌త‌మే సినిమా జూన్‌ 24న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం నేడు ట్రైలర్‌ను విడుదల చేసింది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 06:32 PM IST
  • లారీలైనా గుద్దితే తిరిగి చూస్తాయేమో గానీ
  • ఈ అమ్మాయిలు తిరిగిచూసేలా లేరు
  • 'సమ్మతమే' ట్రైలర్‌ రిలీజ్‌
Sammathame Trailer: లారీలైనా గుద్దితే తిరిగి చూస్తాయేమో గానీ.. ఈ అమ్మాయిలు తిరిగిచూసేలా లేరు!

Sammathame movie Trailer released: టాలీవుడ్ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల 'సెబాస్టియ‌న్ పీసీ 524' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్‌.. ఇప్పుడు 'స‌మ్మ‌త‌మే' సినిమాతో వస్తున్నాడు. గోపీనాథ్ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను యు.జి ప్రొడక్షన్స్‌ సంస్థపై కంకణాల ప్రవీణ్‌ నిర్మించారు. మ్యూజికల్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన స‌మ్మ‌త‌మే సినిమాలో తెలుగందం చాందినీ చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌ యూత్‌ను ఆకట్టుకుంది. 

స‌మ్మ‌త‌మే సినిమా జూన్‌ 24న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి విడుదల చేశారు. మూడు నిమిషాల 14 సెకండ్ల నిడివి గల ట్రైలర్‌.. 'ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మీ. వాళ్లు లేని ఇళ్లు ఇలాగే ఉంటుంది' అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. 'చెప్పు నాకు ఏ క్లాస్‌లో పెళ్లి చేస్తావ్‌', 'ఇన్నాళ్లు గోల్డ్‌ చైన్‌ వేసుకున్నందుకు ఇన్నాళ్లకు వచ్చిందిరా గోల్డెన్‌ ఆపర్చునిటీ', 'నీకు ఏ అమ్మాయి కరెక్ట్‌ కాదు.. అద్దంలో నీ మొహం చూసుకుని, బొట్టు పెట్టుకుని తాళి కట్టుకో', 'లారీలైనా గుద్దితే తిరిగి చూస్తాయేమో గానీ.. ఈ అమ్మాయిలు తిరిగిచూసేలా లేరు' అంటూ చెప్పై చాలా డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. 

ఫ‌న్ అండ్ సీరియ‌స్ కథతో సాగే ఎంట‌ర్ టైనింగ్ ల‌వ్ స్టోరీని చూపించ‌బోతున్న‌ట్టు ద‌ర్శ‌కుడు ట్రైల‌ర్‌తో చెప్పేశాడు. గోపీనాథ్ రెడ్డికి ఇదే మొదటి సినిమా అయినా ట్రైల‌ర్‌ను బట్టి చిత్రం బాగుంటుందనిపిస్తోంది. కిర‌ణ్‌ అబ్బవరం, చాందిని చౌదరి లుక్స్‌ చాలా కొత్తగా ఉండగా.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. నాయకానాయికల మ‌ధ్య ఫ‌న్నీగా సాగుతున్న ల‌వ్ ట్రాక్‌.. యూ ట‌ర్న్ తీసుకుందని చూపుతూ ట్రైల‌ర్‌ని కట్ చేయడంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. శేఖ‌ర్ చంద్ర అందించిన మ్యూజిక్ బాగుంది.

Also Read: Donkey Milk Farm: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి.. గాడిదలు పెంచుకుంటున్నాడు! లక్షలు సంపాదిస్తున్నాడు

Also Read: Congress MP Jyotimani: నా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.. మహిళా ఎంపీ ఆరోపణలు..!

 

లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News