Union Budget 2025: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభలో 2025-26 సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా మహాకవి గురుజాడ అప్పారావు చెప్పిన సూక్తిని ‘దేశం అంటే మట్టి కాదోయ్.. దేశ మంటే మనుషులోయ్’ అని సూక్తిని లోక్ సభ ప్రస్తావించడం గమనార్హం. అంతకు ముందు నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు.
పార్లమెంట్ హౌస్‌లో మోదీ మంత్రివర్గ సమావేశం జరిగింది. సాధారణ బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్టపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించారు. ఆమెకు రాష్ట్రపతి స్వీటు తినిపించారు. మొత్తంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఆ నిరసనల మధ్య లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్. అంతేకాదు గత పదేళ్లలో నరేంద్ర మోడీ సర్కార్ సాధించిన అభివృద్ది,సంస్కరణలతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పేదరికం దిగువ స్థాయికి చేరిందనే విషయాన్ని ప్రస్తావించారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
పీఎం ధన్ ధాన్య పథకం రాష్ట్రాల సహాకారంతో అమలు చేయనున్నట్టు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. జీరో పేదరికమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నారు. 6 రంగాల్లో సమూల మార్పులు చేస్తున్నామన్నారు. పండ్లు, కూరగాయాలు నాణ్యత పెంచేలా కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వృద్ధి మందగించిన, భారత్ మాత్రం వేగంగా అభివృద్ది చెందిన విషయాన్ని ప్రస్తావించారు. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇన్‌ఫ్రా, మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళిక అని చెప్పారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల ప్రజల వలసలకు బ్రేక్ వేయడానికి ప్రత్యేక కార్యక్రమం.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.