Sankranthi ki Vastunnam pre release business details: విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా.. జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా పైన ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రాన్ని సుమారు 90 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ట్రెండింగ్‌లో నిలిచాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ 88 కోట్ల రూపాయలుగా..ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఈ చిత్రం జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్:
- నైజాం: ₹20 కోట్లు
- సీడెడ్: ₹10 కోట్లు
- ఉత్తరాంధ్ర: ₹8 కోట్లు
- తూర్పు గోదావరి: ₹5 కోట్లు
- పశ్చిమ గోదావరి: ₹4.5 కోట్లు
- గుంటూరు: ₹5 కోట్లు
- కృష్ణా: ₹5 కోట్లు
- నెల్లూరు: ₹3 కోట్లు
మరోపక్కvమిగతా ప్రాంతాల్లో బిజినెస్ వివరాల్లోకి వెళితే:
- కర్ణాటక: ₹4 కోట్లు
- ఇతర రాష్ట్రాలు: ₹1.5 కోట్లు
- నార్త్ అమెరికా హక్కులు: $1.35 మిలియన్ (₹12 కోట్లు)
- ఓవర్సీస్ ఇతర ప్రాంతాలు: ₹10 కోట్లు
కాబట్టి ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 90 కోట్ల షేర్ వసూలు చేసి, ₹180 కోట్ల గ్రాస్ సాధించాలి. ఇది సాధ్యమవుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో చూడాలి.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విశ్లేషణ ప్రకారం, బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరేందుకు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. సంక్రాంతి సెలవులు ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. మరోపక్క రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ కి పూర్తి నెగిటివ్ టాక్ రావడంతో.. ఆ చిత్రం ఈ సినిమాకి ఎటువంటి పోటీ ఇవ్వలేదు అనేది అందరి అభిప్రాయం. అయితే బాలకృష్ణ చిత్రం డాకు మహారాజు మాత్రం.. మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. కానీ ఈ చిత్రం ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడంతో.. మరోపక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి టార్గెట్ చేయడంతో.. ఈ రెండు చిత్రాలు భిన్న కాన్సెప్టులతో వచ్చినవి కాబట్టి.. రెండు చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు ఉంటారు అనేది అందరి భావన. మరి ఈ రెండు సినిమాలు.. సంక్రాంతికి ముగిసే సరికి ఎన్ని కలెక్షన్ సాధించి.. విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter