Shah Rukh Khan Jawan Movie: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్-తమిళ స్టార్ డైరెక్టర్ అట్టీ కాంబోలో తెరకెక్కిన జవాన్ బాక్సాఫీసు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో హిందీ చిత్రంగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 'జవాన్' సోమవారం రూ.14.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా హిందీ మొత్తం కలెక్షన్ రూ.450 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా వేగంగా రూ.400 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 13 రోజుల్లో అన్ని భాషల్లో కలుపుకుంటే.. రూ.883.68 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది జవాన్.
హిందీలో బాహుబలి-2 20 రోజుల్లో రూ.450 కోట్ల మార్క్ చేరుకోగా.. పఠాన్ 18 రోజులు, గద్దర్-2 17 రోజుల్లో రాబట్టాయి. అయితే జవాన్ మాత్రం 13 రోజుల్లోనే ఈ మార్క్‌ను చేరుకుని రికార్డు సృష్టించింది. త్వరలో జవాన్ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో నిర్మాతలు రీసెంట్‌గా ముంబైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, అట్లీ పాల్గొన్నారు.
సినిమా విజయం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్న షారుఖ్ ఖాన్.. ఇది అద్భుతమైన వేడుక అని అన్నారు. ఒక సినిమాతో ఏళ్ల తరబడి జీవించే అవకాశం మనకు చాలా అరుదు అని.. కోవిడ్ కారణంగా జవాన్ మూవీ నాలుగేళ్లుగా సెట్స్‌పై ఉందని.. ఈ సినిమాలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు. ముఖ్యంగా సౌత్ నుంచి ముంబైకి వచ్చి స్థిరపడి.. గత నాలుగేళ్లుగా ముంబైలో ఉంటూ జవాన్ సినిమా కోసం రాత్రి పగలు పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఇలా చేయడం చాలా కష్టమైన పని అంటూ షారుఖ్ చెప్పుకొచ్చారు. ఇది చాలా కష్టమైన పని అన్నారు.
అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో నయనతార, దీపికా పదుకొనే, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య కీలక పాత్రలు పోషించారు. 'జవాన్' సక్సెస్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్ తన రాబోయే చిత్రం 'డుంకీ' విడుదల తేదీని కూడా ప్రకటించారు. జనవరి 26న రిపబ్లిక్ డే (పఠాన్‌తో) ప్రారంభించామని.. ఆ తరువాత జన్మాష్టమికి జవాన్‌ని విడుదల చేశామని.. ఇప్పుడు న్యూ ఇయర్, క్రిస్మస్ సందర్భంగా డుంకీ మూవీని విడుదల చేస్తామని తెలిపారు.
Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook