Vidya Balan As Shakuntala Devi: విద్యాబాలన్ కథానాయికగా.. హ్యూమన్ కంప్యూటర్ (Human Computer ) శకుంతలా దేవీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న "శకుంతలా దేవీ" ట్రైలర్ విడుదలైంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన అద్భుతమమైన "కాలిక్యులేషన్ మైండ్" వల్ల ప్రసిద్ధి చెందిన శకుంతలా దేవీ పాత్రలో విద్యాబాలన్ ఇమిడిపోయారు అని ట్రైలర్ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు. Think Different: ఈ వీడియో మీ ఐడియాను మార్చేస్తుంది
శకుంతలా దేవీ ట్రైలర్ 2 నిమిషాల 47 సెకన్లు ఉంది. లెక్కల మాంత్రికురాలు శకుంతలా దేవీ "హ్యూమన్ కంప్యూటర్"గా ఎలా పేరు సంపాదించుకుంది అనేది ట్రైలర్లో మీరు స్పష్టంగా చూడవచ్చు. ఒక సీన్లో నేను కరెక్టే చెప్పాను.. కంప్యూటర్ తప్పు చెప్పింది అని శకుంతలా దేవీ అంటుంది. వెంటనే "అందుకే మిమ్మల్ని హ్యూమన్ కాలిక్యులేటర్ అంటారు" అనే డైలాగ్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి అను మెనన్ దర్శకత్వం వహిస్తున్నారు.
జీవిత కథ చిత్రాల్లో నటించడం విద్యాబాలన్‌కు ఇది మొదటిసారి కాదు. గతంలో సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్లో నటించి మెప్పించింది. అయితే సినిమా విడుదల విషయంలో నిర్మాతలు ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేకపోవడంతో ఈ సినిమా నిర్మాతలు ఓటీటీ (OTT ) లో చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయాలని అని నిర్ణయించుకున్నారని సమాచారం. శకుంతలా దేవీ చిత్రం జూలై 31న విడుదల కానుంది.
Skill India: నైపుణ్యమే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ