Sirivennela Seetharamasastry last rites: సినీ సాహితీ దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సిరివెన్నెల (Sirivennela Seetharamasastry ) పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ ఆయన చితికి నిప్పంటించారు. హిందూ సాంప్రదాయ పద్దతిలో వేద పండితులు అంత్యక్రియల క్రతువు నిర్వహించారు. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు పలికారు.
మహాప్రస్థానంలో సిరివెన్నెల (Sirivennela Seetharamasastry) అంత్యక్రియలకు అంత సిద్ధమైన వేళ గాయకుడు మనో అక్కడికి చేరుకున్నారు. సిరివెన్నెలను కడసారి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజా యుద్ధనౌక గద్ధర్ (Gaddar), ప్రజా గాయకురాలు విమలక్కలు సైతం మహాప్రస్థానంలో సిరివెన్నెలకు నివాళులర్పించారు. అంతకుముందు, ఫిలిం ఛాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు సిరివెన్నెల అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సిరివెన్నెల మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల (Shekar Kammula) సీతారామశాస్త్రి వెళ్లిపోవడం మనసుకి కష్టంగా ఉందని ట్వీట్ చేశారు. ఇప్పటికీ 'మిత్రమా' అనే ఆయన పిలుపే చెవుల్లో మోగుతోందన్నారు. హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) తన ఫేవరెట్ సాంగ్‌గా పేర్కొంటూ సిరివెన్నెల గతంలో స్వయంగా పాడిన ఓ పాట లింకును షేర్ చేశారు. 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి... ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి...' అంటూ సాగే ఆ పాట తనకెప్పుడూ స్పూర్తినిస్తుందని చెప్పుకొచ్చారు.
My favourite song ,
My favourite lyrics , my favourite lyric writer, my inspirational song in the times that I was broken and thinking of giving up #eppuduopukovadhuraotami https://t.co/PeKKyTaguC pic.twitter.com/En7DnZGtDB— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 1, 2021
కాగా, సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 30) సాయంత్రం 4గం. సమయంలో సిరివెన్నెల (Sirivennela Seetharamasastry) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో ఇన్ఫెక్షన్ ఎక్కువవడంతో వైద్యులు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఇటీవల మరో ఊపిరితిత్తికి కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువవడం, కిడ్నీ పనితీరు కూడా దెబ్బతినడంతో ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు.
Also Read: Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల చనిపోవడానికి కారణాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook