Tamil Nadu government’s shocking reply about The Kerala story: ది కేరళ స్టోరీ అనే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక ప్రాపగండా సినిమా అని చెబుతూ వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ సినిమా మీద బ్యాన్ విధించారు. తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది.
అయితే ఈ నేపథ్యంలోనే సినిమా యూనిట్ కోర్టుని ఆశ్రయించింది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వమని కోర్టును కోరింది. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్లో అయితే సినిమా మీద బ్యాన్ ఎత్తివేశారు. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం కోర్టుకి ఒక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. అదేంటంటే తాము సినిమాని బ్యాన్ చేయలేదని సినిమా ధియేటర్లో ఓనర్లు వాలంటరీగా ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసేసారని చెప్పుకొచ్చారు.
Also Read: Music Director Raj: టాలీవుడ్లో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూత
ఆడియన్స్ నుంచి సరైన రెస్పాన్స్ లేని నేపథ్యంలో సినిమా తీసేసారని తమిళనాడు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇక అంతేకాదు తాము ఎలాంటి ఆర్డర్స్ ఈ సినిమాని బ్యాన్ చేయమని జారీ చేయలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ సినిమా ప్రదర్శిస్తున్న చోట ప్రభుత్వం తరఫు నుంచి సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయని అలా చేయడం ఇష్టం లేక థియేటర్లో ఓనర్లు సినిమాని ఏడో తారీఖు నుంచి తీసేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించగా సంగీత బిహాని, సోనియా బలానీ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. కేరళలోని ముగ్గురు ఇతర పాత్రలకు చెందిన అమ్మాయిలను ఒక గ్యాంగ్ మతం మార్చి ఎలా ఐసిస్ ఉగ్రవాద ముఠాల్లో చేర్చి దేశాలు మార్చారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. ముందు గురించి 32,000 మంది యువతులను ఇలా కేరళ దాటించారు ప్రచారం చేస్తూ వచ్చిన చివరికి ముగ్గురు యువతుల కథ ఆధారంగానే సినిమా చేశామని చెబుతున్నారు.
Also Read: Pavitra Lokesh: నరేష్ నా పార్టనర్ మాత్రమే కాదు.. పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook