Unstoppable Pawan Kalyan Promo: మూడు పెళ్లిళ్లపై అడిగేసిన బాలయ్య.. పవన్ కళ్యాణ్ సమాధానం ఇదే..

Unstoppable With NBK Pawan Kalyan Promo: నందమూరి బాలకృష్టగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్‌-2 షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించి మరో ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య అడిగిన ప్రశ్నలు ఏంటి..? పవన్ ఎలాంటి సమాధానాలు ఇచ్చాడు..? ప్రోమోను చూసేయండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2023, 08:34 PM IST
Unstoppable Pawan Kalyan Promo: మూడు పెళ్లిళ్లపై అడిగేసిన బాలయ్య.. పవన్ కళ్యాణ్ సమాధానం ఇదే..

Unstoppable With NBK Pawan Kalyan Promo: అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య-పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్-2 షో మరో ప్రోమో వచ్చేసింది. బండ్ల గడేష్ డైలాగ్‌తో బాలయ్య ఎపిసోడ్‌ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ డైలాగ్ చెప్పాడు. భీమ్లానాయక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రోమోను సూపర్‌గా కట్ చేశారు. ఇటు నందమూరి అభిమానులకు.. అటు పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చే ప్రోమో అని చెప్పొచ్చు. ఈ షోలో బాలయ్య ఆసక్తికరంగా ప్రశ్నలు అడగ్గా.. పవన్ కళ్యాణ్‌ ఓపెన్‌గా సమాధానాలు చెప్పినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. మధ్యలో సాయి ధరమ్ తేజ్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చి నవ్వులు పూయించాడు. బాలయ్యతో కలిసి తెగ నవ్వేంచేశాడు.

నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు అని చెప్పాడు పవన్ కళ్యాణ్. గుడుంబా శంకర్ మూవీలో ప్యాంట్ మీద ప్యాంట్ వేయడంతో పాతికేళ్ల వయసు తగ్గిపోయావని బాలయ్య అన్నాడు. ఈ సందర్భంగా బాలకృష్ట, పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ కలిసిన పిక్‌ను చూపించారు. అప్పుడు నేను కుర్రాడిలా ఉన్న కదా అని బాలయ్య అనగా.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు సార్ అంటూ పవన్ చమత్కిరించాడు. త్రివిక్రమ్ నువ్వు మంచి ఫ్రెండ్స్ కదా అని బాలకృష్ట అడగ్గా.. అవ్వాల్సి వచ్చిందన్నాడు పవన్.  

రామ్‌ చరణ్‌ నీకు ఎలా క్లోజ్ అని ఎన్‌బీకే ప్రశ్నించగా.. 'నాకు చిన్నప్పుడు డ్యూటీ ఉండేది. నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉండేవారు కాబట్టి ఇంట్లో నేను ఒక్కడే దొరికిపోయేవాడిని. అలా పిల్లలతో క్లోజ్ అవ్వాల్సి వచ్చింది..' పవన్ కళ్యాణ్ సరదాగా చెప్పుకొచ్చాడు.

అనంతరం రామ్ చరణ్‌కు ఫోన్ చేశాడు బాలయ్య. 'ఏమయ్యా ఫిటింగ్ మాస్టరు. నేను ఒక్క విషయం అడగడానికి ఫోన్ చేశాను. ప్రభాస్ గురించి ఏదైనా మ్యాటర్ చెప్పవయ్యా అంటే.. నీ గుడ్‌న్యూస్ మింగేసి.. అతని గుడ్‌న్యూస్ చెప్పావు..' అని బాలయ్య అన్నాడు.  ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి. 

తరువాత సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి నవ్వులు పూయించాడు. ఆఖరికి అమ్మాయిలను ఎలా గౌరవించాలో ఆయన నేర్పించారు అని పవన్‌ను సాయి ధరమ్ తేజ్ చూపించగా.. ఆ ఏంటి అని పవన్ అన్నాడు. తొడగొట్టు అని తేజ్‌ను బాలయ్య అడగ్గా.. వెళ్లి బాలయ్య తొడ గొట్టేందుకు ప్రయత్నించాడు. నా తొడ కాదయ్యా అంటూ బాలయ్య అనడం నవ్వు తెప్పిస్తోంది. 

కామెడీ ట్రాక్ అనంతరం సీరియస్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటి భయ్యా అని బాలయ్య ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ సీరియస్‌గా సమాధానం ఇచ్చాడు. ఇంత మానసిక సంఘర్షణకు గురైన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ ఎలా అయ్యాడు..? ఎన్‌బీకే అడిగాడు. పవన్ ఆన్సర్ ఇస్తుండగా.. బాలయ్య ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Nara Lokesh: జ‌గ‌న్‌ బుల్లెట్ లేని గ‌న్‌.. సౌండ్ ఎక్కువ ప‌ని త‌క్కువ‌: నారా లోకేష్ సెటైర్లు  

Also Read: CM Jagan Mohan Reddy: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. సీఎం జగన్ యాక్షన్ ప్లాన్.. మార్చి 1 నుంచి ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News