Varalakshmi Sarathkumar as sabari: విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి పెద్ద స్టార్. కూతురు హీరోయిన్ కావడం సుతారాము ఇష్టం లేదు. కానీ ఆమె మొండి పట్టుదల చూసి సరే అన్నాడు. 2012లో శింబు హీరోగా తెరకెక్కిన 'పోరా పోడి' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో కథానాయికగా చెలరేగి పోయింది. మరోవైపు కన్నడ, మలయాళంలో కథానాయికగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక విశాల్ హీరోగా నటించిన 'పందెం కోడి 2'లో ప్రతి నాయకురాలిగా వరలక్ష్మి నటకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత విజయ్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్'తో ఢీటైన విలన్ పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత వరలక్ష్మికి అలాంటి పాత్రలే పలకరిస్తూ వస్తున్నాయి. ఆయా స్థానాల్లో తనదైన నటనతో మెప్పిస్తోంది. ఇక సమంత హీరోయిన్‌గా నటించిన 'యశోదా'లో ఈమె విలనిజానికి హాట్సాఫ్ చెప్పాల్పిందే. ఈ యేడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'హనుమాన్' మూవీలో హీరో అక్క అంజమ్మ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అక్కా, చెల్లి, విలన్ పాత్రలతో మెప్పిస్తోన్న ఈమె తాజాగా 'శబరి' మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపెట్టడానికీ రెడీ అవుతోంది.
మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ఈ సినిమాను నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా మే 3న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తెరపై రాని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా 'శబరి'. ఈ సినిమా కథ, కథనాలు కొత్తగా ఉండబోతున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటనకు 'వావ్' అనాల్సిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తైయిన ఈ సినిమాకు సంబంధించిన తెలుగు, తమిళ వెర్షన్స్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. అవుట్ పుట్ చాలా బాగా వచ్చినట్టు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం మాకు ఉంది. మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి అయ్యాయి. 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో విడుదల చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 3న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. మరి ఈ సినిమాతో కథానాయికగా వరలక్ష్మి శరత్ కుమార్ బ్యాక్ బౌన్స్ అవుతుందా లేదా అనేది చూడాలి.
Also Read: KCR Arrest: కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook