Vijay Antony Divorce : తమిళ్ స్టార్ హీరోగా విజయ్ ఆంటోనికి మంచి గుర్తింపు ఉంది. ఎప్పుడూ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ ఉంటాడు విజయ్ ఆంటోని. డాక్టర్ సలీమ్, బిచ్చగాడు సినిమాలతో తెలుగు వారికి దగ్గరయ్యాడు విజయ్. మరీ ముఖ్యంగా బిచ్చగాడు సినిమాలోని మదర్ సెంటిమెంట్ ఇక్కడ బాగా వర్కవుట్ అయింది. తెలుగులో విజయ్ ఆంటోనికి ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఆ తరువాత వరుస పెట్టి డబ్బింగ్ సినిమాలతో విజయ్ దాడి చేశారు.
అందులో ఏ ఒక్క చిత్రం కూడా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు విజయ్ వేసిన ట్వీట్, విడాకులపై పరోక్షంగా వేసిన పోస్ట్ అందరిలోనూ అనుమానాలు పుట్టిస్తోంది. విజయ్ తన భార్య ఫాతిమాతో దూరంగా ఉంటున్నాడని, మనస్పర్థలు రావడం వల్లే ఇలా దూరంగా ఉంటున్నారని, విడాకులు తీసుకోబోతోన్నారంటూ రూమర్లు చక్కర్లుకొడుతున్నాయి.
ఇక విజయ్ తాజాగా వేసిన ట్వీట్ మీద అందరూ తమ తమ విశ్లేషణలు చేస్తున్నారు.మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే.. మీ మధ్య గొడవలు లేకుండా చూసుకోండి.. పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోండి.. ఇళ్లు వదిలేసి వెళ్లండి.. కావాలంటే.. ఎవరికి వారు విడిపోయి.. ప్రశాంతంగా, సంతోషంగా బతకండి.. అంతే కానీ మూడో వ్యక్తిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడకండి.. చివరకు ఆ వ్యక్తి వల్లే సర్వనాశనం అవుతుందన్నట్టుగా చెప్పుకొచ్చాడు విజయ్ ఆంటోని.
అయితే విజయ్ నార్మల్‌గా ట్వీట్ వేశాడా? లేదా? నిజంగానే తన ఫ్యామిలీలోని గొడవలనే ఇలా చెప్పాడా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి సమంత చైతన్య, ఐశ్వర్య ధనుష్‌ల తరువాత ఇప్పుడు విజయ్ ఆంటోని విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ధనుష్ ఐశ్వర్యలు మాత్రం విడాకులు వెనక్కి తీసుకుంటున్నారనే టాక్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read : Puri Jagannadh-Chiranjeevi : చిరు పూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కేనా?
Also Read : Ponniyin Slevan Fake Collections : ఉమైర్ సంధు ట్వీట్లపై నెటిజన్ల ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook