Vijay Devarakonda at Prayag raj video: కుంభమేళకు ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో మనదేశం నుంచి మాత్రమే కాకుండ.. విదేశాల నుంచి కూడా ప్రముఖులు కుంభమేళకు భారీగా తరలి వస్తున్నారు. సినిమా రంగానికి, రాజకీయా రంగ ప్రముఖులు కుంభమేళకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే దేశ ప్రధాని మోదీ, భూటాన్ రాజు, వివిధ రాష్ట్రల ముఖ్య మంత్రులు ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాలు ఆచరించారు.
ఇప్పటికే.. సంయుక్త మీనన్, బిందు మాధవి, యాంకర్ లాస్య, పూనమ్ పాండే, పవిత్ర గౌడ, శ్రీనిధి శెట్టి, వంటి ప్రముఖులు కుంభమేళాకు వచ్చి పవిత్రమైన స్నానాలు ఆచరించారు. తాజాగా.. రౌడీ హీరో విజయ్ దేవర కొండ ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వచ్చారు.
#VijayDevarakonda With His Mother Off To #MahaKumbh Mela @TheDeverakonda pic.twitter.com/LQOS2MmMF2
— Sriman VD (@AAyyawar96241) February 7, 2025
ఆయన ఎయిర్ పోర్టులో తన తల్లితో కలిసి పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ కుంభమేళ మాత్రం భక్తులతో కిటకిటలాడుతుంది.
దాదాపు 39 కోట్ల మంది భక్తులు ఇప్పటి వరకు పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26 మరో రెండు షాహీ స్నానాలు మిగిలి ఉన్నాయి. మఘపౌర్ణమి, మహా శివరాత్రి నేపథ్యంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించన్నారు. ఈ రెండు రోజుల్లో కూడా భారీగా భక్తులు వస్తారని సమాచారం. ప్రస్తుతం రౌడీ హీరో తన తల్లితో కలిసి విమానశ్రయంలో కన్పించారు. అభిమానులు రౌడీ హీరో అంటూ కేకలు వేశారు.
మరికొందరు రష్మిక ఎక్కడ బ్రో అంటూ గట్టిగా అరుపులు పెట్టారు. కుంభమేళలో ప్రస్తుతం భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మరోవైపు ఒక వైపు కుంభమేళకు భక్తులు పొటెత్తుతున్న నేపథ్యంలో తాజాగా, కుంభమేళలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొవడం ప్రస్తుతం ఆందోళన కల్గించే అంశంగా మారిందని చెప్పుకొవచ్చు. ఇటీవల తొక్కిసలాట చోటు చేసుకుంది. అంతకు ముందు కూడా కుంభమేళలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter