Das Ka Dhamki - Trailer: ఫ** ఆఫ్ అంటూ రెచ్చిపోయిన విశ్వక్.. గెటవుట్ పదాన్ని కూడా వదల్లేదుగా !

Das Ka Dhamki - Trailer 1.0 Talk: విశ్వక్సేన్ హీరోగా నటిసున్న కొత్త సినిమా ట్రైలర్ దాస్ కా ధమ్కీ ట్రైలర్ వన్ పాయింట్ ఓ పేరుతో రిలీజ్ అయింది. సదరు ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ​

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 18, 2022, 09:46 PM IST
Das Ka Dhamki - Trailer: ఫ** ఆఫ్ అంటూ రెచ్చిపోయిన విశ్వక్.. గెటవుట్ పదాన్ని కూడా వదల్లేదుగా !

Vishwak Sen Das Ka Dhamki - Trailer 1.0 Talk: ఈ మధ్య కాలంలో వరుస వివాదాలతో హాట్ టాపిక్ గా మారుతున్న విశ్వక్సేన్ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. దాస్ కా ధమ్కీ ట్రైలర్ వన్ పాయింట్ ఓ పేరుతో రిలీజ్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఏఎంబీ థియేటర్స్ లో విడుదలైన ఈ ట్రైలర్ విడుదలైన కొద్దిసేపట్లోనే లక్షల వ్యూస్ సాధించింది.

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నివేదా పేతురు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, తరుణ్ భాస్కర్, శౌర్య, అక్షర గౌడ, అజయ్, హైపర్ ఆది, పృథ్వీరాజ్, కాదంబరి కిరణ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. లియాన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి నేను లోకల్, సినిమా చూపిస్త మావ సినిమాల ఫేమ్ ప్రసన్నకుమార్ బెజవాడ స్టోరీ అందిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News