Vishwak Sen- Gangs Of Godavari: విశ్వక్ సేన్ హీరోగా సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ వెళుతున్నాడు. ఈ యేడాది గామి మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాలో విశ్వక్సేన్ అఘోరా పాత్రలో నటించాడు.ఈ సినిమాకు మంచి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అంతకు ముందు దాస్ కా దమ్కీ మూవీతో పలకరించాడు. ఈ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 3.51 కోట్ల షేర్ ( రూ. 8 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. రెండో రోజు కూడా ఈ సినిమా డీసెంట్ వసూళ్లనే రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండో రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.55 కోట్ల షేర్ (రూ. 3 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీస్ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్ల విషయానికొస్తే..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ.. తొలి రోజు.. రూ. 3.51 కోట్ల షేర్
గామి.. రూ. 2.96 కోట్ల షేర్ రాబట్టింది.
దాస్ కా దమ్కీ మూవీ తొలి రోజు .. 3.06 కోట్ల షేర్
ఓరి దేవుడా మూవీ.. రూ. 90 లక్షలు షేర్
అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ.. రూ. 65 లక్షలు షేర్
పాగల్ మూవీ తొలి రోజు.. రూ. 1.30 కోట్ల షేర్
హిట్ ది ఫస్ట్ కేస్ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.32 కోట్ల షేర్ రాబట్టింది.
ఫలక్ నుమా దాస్ .. 1.02 కోట్ల షేర్ రాబట్టింది.
మొత్తంగా సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయానికొస్తే.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్.. ఫార్చూన్ ఫోర్ సంస్థ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. శనివారం డీసెంట్ హోల్డ్ నిలబెట్టుకుంది. ఈ రోజు ఆదివారం అదే జోరు కొనసాగిస్తే ఈ సినిమా సేఫ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 6.26 కోట్ల షేర్ (రూ. 11.30 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రూ. 4.74 కోట్ల దూరంలో ఉంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ వరకు ఈ సినిమా సేఫ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో విశ్వక్‌సేన్ సరసన నేహా శెట్టి నటించింది. అంజలి మరో స్పెషల్ రోల్లో యాక్ట్ చేసింది. అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేసింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదలైన మూడు వారాలకు అంటే ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ రానున్నట్టు సమాచారం.
Also Read: Telangana Lok Sabha: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. కాంగ్రెస్‌కు బీజేపీ షాక్.. కారు షెడ్డుకే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook