Case to Ban Virata Parvam : ఈ మధ్య అనేక సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది. సినిమా విడుదలకు ముందు సాయి పల్లవి కాశ్మీర్ ఫైల్స్ ను గో రక్షకులతో పోల్చడంతో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ట్రోల్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కొంతమంది ఆమెను తీవ్రంగా వ్యతిరేకించి విమర్శలు చేయగా, కొంత మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. తాజాగా సాయి పల్లవి ఆ వివాదంపై స్పందిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు.
ఆ సంగతి అలా ఉంచితే తాజాగా విరాటపర్వం సినిమా బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ లో ఒక తాజా కేసు నమోదయింది. దర్శకుడు వేణు ఈ సినిమాను నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తూము సరళ అనే మహిళ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించగా ఇప్పుడు అదే ఇప్పుడు సినిమాకు టెన్షన్ తెచ్చి పెడుతోంది. తాజాగా విశ్వ హిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి కె.అజయ్ రాజ్ సుల్తాన్‌బజార్ పోలీసులకు శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.
విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని, పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సినిమాలో చాలాకు అభ్యంతరమైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ పరిశీలనలోకి తీసుకుని సినిమా ప్రదర్శన వెంటనే ఆపివేయాలని, సినిమా బ్యాన్ చేయాలని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వాలు నిషేధించిన నక్సలిజం, ఉగ్రవాదాలను ప్రేరేపించే ఇలాంటి సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు.
అంతే కాదు సినిమాను బ్యాన్ చేయాలని ఫిర్యాదులో కోరడమే కాదు, విరాటపర్వం సినిమాకు అనుమతులు ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారి శిఫాలి కుమార్ పై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయం మీద ఫిర్యాదు అందుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక ఈ విషయం మీద సినిమా టీమ్ కానీ, సెన్సార్ బోర్డు అధికారి శిఫాలి కుమార్ కానీ ఎలా స్పందిస్తారు? అనేది చూడాల్సి ఉంది. ఇక సినిమా బాగుందని టాక్ వినిపిస్తున్నా సినిమాకు కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. మొదటి రోజు కోటి లోపే కలెక్షన్స్ రావడంతో లాంగ్ రన్ మీదే ఆశలు పెట్టుకున్నారు మేకర్స్.
Also Read: Sai Pallavi Explanation: మతం గురించి మాట్లాడలేదు.. భజరంగ్ దళ్ హెచ్చరికలకు సాయి పల్లవి సమాధానం
Also Read : Malavika Mohanan Pics: గ్లామర్ డోస్ పెంచిన మాళవిక మోహనన్.. క్లీవేజ్ అందాలతో రచ్చ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook