Babu Movie: బిగ్‌ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ 'బాబు' మూవీ రిలీజ్‌కు రెడీ.. ప్రమోషన్స్ షురూ..

Babu Movie Updates: అర్జున్ కళ్యాణ్ హీరోగా.. ఎంఎల్ఆర్ దర్శకత్వంలో 'బాబు' అనే మూవీ తెరకెక్కింది. కుషిత కల్లాపు హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. దండు దిలీప్ కుమార్ రెడ్డి  నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. త్వరలోనే ఆడియన్స్‌ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 04:07 PM IST
Babu Movie: బిగ్‌ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ 'బాబు' మూవీ రిలీజ్‌కు రెడీ.. ప్రమోషన్స్ షురూ..

Babu Movie Updates: బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లాపు జంటగా నటిస్తున్న మూవీ ‘బాబు’. ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) దర్శకత్వం వహిస్తున్నారు. డీడీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది. 

ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినీ ప్రేమికులను ఆకట్టుకుంది. విడుదలకు ముందు మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ భాషల్లో కూడా బాబు మూవీ రిలీజ్ కానుంది. ఎంఎల్ఆర్, సోనాలి, మురళీధర్ గౌడ్, భద్రం, జబర్దస్త్ అప్పారావు, రవి వర్మ, సునిత మనోహర్, అశోక్ వర్దన్, భద్రి జార్జి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

సాంకేతిక బృందం

==> బ్యానర్ :  డీడీ క్రియేషన్స్
==> ప్రొడ్యూసర్ : దండు దిలీప్ కుమార్ రెడ్డి
==> డైరెక్టర్ : ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ)
==> మ్యూజిక్ డైరెక్టర్: పవన్
==> కెమెరామెన్ : పీఎస్ మణికర్నన్
==> ఎడిటర్: డి.వెంకటప్రభు
==> PRO : సాయి సతీష్

Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్

Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News