న్యూఢిల్లీ: బంగారం ధరలు భగ భగ మండిపోతున్నాయి. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యలో, అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటివి పసిడి ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మనజాతిని కకావికలం చేస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో మదుపరులు బంగారంలో మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ఆకాశాన్ని తాకుతోంది.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశే..!!
సోమవారం నాటి బులియన్ ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.47,865కు చేరింది. ఇక వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. కిలో వెండి 3శాతం పెరిగి రూ.48,208 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక అంతర్జాతీయంగానూ బంగారం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే సోమవారం ఏకంగా 1శాతం పెరిగిన బంగారం ధర ఔన్సు 1,760.85 డాలర్లకు పెరిగింది. 2012, అక్టోబరు 12 తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల కావడం ఆశ్చర్యంగా భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..