హైదరాబాద్: ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. తనకు కథ ఇచ్చేందుకు 2017 మే నెలలో రూ.15 లక్షల మేర ఒప్పందం కుదుర్చుకున్న కోన వెంకట్.. ఆ తర్వాత కథ ఇవ్వకుండా ముఖం చాటేసాడని బోరబండ మోతీనగర్‌కు చెందిన ఆర్‌విఆర్‌వి ప్రసాద్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీడీఎస్ మినహాయించుకొని రూ.13.5లక్షల చెక్కును ఇచ్చానని.. కోన వెంకట్ డబ్బును కూడా డ్రా చేశాడని ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కథ విషయమై మాట్లాడేందుకు కోన వెంకట్‌కి ఫోన్ చేస్తే.. కథ ఇవ్వకపోగా తనపైనే దుర్భషలాడాడని ప్రసాద్ వాపోయాడు. అదే సమయంలో మధ్యవర్తి భానును నిలదీయగా కోన వెంకట్ అమెరికాలో ఉంటున్నట్టు తెలిసింది. దీంతో ప్రసాద్ తరపున అతడి కంపెనీ ప్రతినిధులు కోన వెంకట్‌కు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపించినప్పటికీ.. కోన వెంకట్ నిర్లక్ష్య దోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కోన వెంకట్ తనను మోసం చేశాడని పేర్కొంటూ ప్రసాద్ పోలీసులను ఆశ్రయించాడు.