Aadi Sai Kumar Top Gear : టాప్ గేర్ బడ్జెట్ పెరగడానికి కారణం అదే.. ఆదిపై నిర్మాత కామెంట్స్

Aadi Sai Kumar Top Gear budget టాప్ గేర్ సినిమా నిర్మాత శ్రీధర్ రెడ్డి తాజాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ఆది నటించిన ఈ చిత్రం మూవీ బడ్జెట్ పెరిగిందని, ఇరవై శాతం బడ్జెట్ పెరిగిందంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2022, 08:07 AM IST
  • రేపే రాబోతోన్న టాప్ గేర్ చిత్రం
  • నిర్మాత శ్రీధర్ రెడ్డి కామెంట్స్ వైరల్
  • టాప్ గేర్ బడ్జెట్‌పై నిర్మాత
Aadi Sai Kumar Top Gear : టాప్ గేర్ బడ్జెట్ పెరగడానికి కారణం అదే.. ఆదిపై నిర్మాత కామెంట్స్

Aadi Sai Kumar Top Gear budget ఆది సాయి కుమార్ నటించిన టాప్ గేర్ సినిమా రేపే (డిసెంబర్ 30) థియేటర్లోకి రాబోతోంది. ఈ మూవీని కె శశికాంత్ దర్శకత్వంలో, కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించాడు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రం రూపొందింది. అయితే రేపు రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా విశేషాలను నిర్మాత శ్రీధర్ రెడ్డి మీడియాతో పంచుకున్నాడు.

ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఇరవై శాతం బడ్జెట్ పెరిగిందని, అయితే క్వాలిటీ కోసమే తాము కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టామని నిర్మాత చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో ఆది కెరీర్ మారుతుంది, వచ్చే ఏడాది అంతా కూడా బాగుంటుందని నిర్మాత తెలిపాడు. ఇక ఈ సినిమాకు ఆర్ఆర్ ప్లస్ అవుతుందని, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ అసలు హీరో అని చెప్పుకొచ్చాడు.

సినిమా కథ తనకు బాగా నచ్చిందని, అయినా ఇప్పుడు కంటెంట్ఉన్న చిత్రాలనే జనాలు ఆధరిస్తున్నారని, కంటెంట్ బాగా లేకపోతే జనాలు థియేటర్లకు రావడం లేదని అన్నాడు. తాను మార్కెట్ చూసి సినిమాలను తీయనని, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండి, తనకు కథ నచ్చితేనే సినిమా తీస్తానని అన్నాడు.

ఇక టాప్ గేర్ సినిమా బాగా వచ్చిందని, విజువల్స్ పరంగా చాలా బాగుంటుందని, శశికాంత్ స్క్రీన్ ప్లే బాగుందని చెప్పుకొచ్చాడు. ఇక రేపు ఈ సినిమాను దాదాపు రెండొందల థియేటర్లో రిలీజ్ చేయబోతోన్నట్టుగా చెప్పుకొచ్చాడు. భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి త్వరలోనే చెబుతానని అన్నాడు. సాయి కుమార్ అయితే ఈ సినిమాను చూసి మెచ్చుకున్నాడని, ఆది కెరీర్‌లో టాప్ గేర్ నిలిచిపోతుందని అన్నాడట.

Also Read : Chiranjeevi : పెద్దరికం అనుభవించాలని లేదు!.. ఇండస్ట్రీ పెద్దపై మరోసారి చిరు కామెంట్స్

Also Read : Spyder Agnyaathavaasi Losses : స్పైడర్, అజ్ఞాతవాసి నష్టాలు.. వేరే వాళ్లు అయితే సూసైడ్ చేసుకునేవాళ్లట.. దిల్ రాజు కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News