Vegetable Juice For Diabetes Immune System: జీవనశైలి మారడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధుల బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇదే కాకుండా చాలామందిలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం, చర్మ సమస్యలు కూడా ఉత్తమవుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడం కోసం మార్కెట్లో లభించే చాలా రకాల ప్రొడక్ట్స్ ని వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన వెజిటేబుల్స్ జ్యూస్ ని తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం తగ్గడమే కాకుండా శరీరంలో అన్ని రకాల వ్యాధుల నుంచి బయటపడని వారు చెబుతున్నారు. అయితే ఈ వెజిటేబుల్ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన వంట గదిలో ప్రతిరోజు దోసకాయ, టమాటో, కాకరకాయలను తరచుగా వినియోగిస్తారు. వీటిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. అయితే వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని ప్రతిరోజు జ్యూస్ లా తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ప్రోటీన్స్, ఫైబర్, సోడియం, విటమిన్ ఏ, విటమిన్ సి, క్యాల్షియం శరీరాన్ని దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.
ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
షుగర్ అదుపులో ఉంటుంది:
కూరగాయలతో చేసిన జ్యూస్ని ప్రతిరోజు తాగితే మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉండొచ్చు. రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రించుకోవడానికి తప్పకుండా ఈ జ్యూస్ ని మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
మలబద్ధకం:
జీవనశైలిలో మార్పుల కారణంగా మధుమేహంతో పాటు మలబద్ధకం సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే మలబద్ధకం సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం సమస్యను సులభంగా నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పొట్టలో వ్యర్ధాలను కూడా బయటకు పంపిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
వాతావరణం మార్పుల కారణంగా చాలామంది జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం కూడా.. అయితే ఈ రీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ మూడు కూరగాయలతో చేసిన జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగాల్సి ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తాగితే శరీరంలో విటమిన్స్ కొరత తగ్గి శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రసాన్ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
Also Read: Kaala Bhairava: శత్రువులను జయించేందుకు కాలభైరవ పూజ చేయండి.. శనివారం పూజ చేస్తే విజయం మీదే..
Also Read: Team India: ఒకే ఏడాదిలో 8 మంది కెప్టెన్లు.. కేఎల్ రాహుల్ ఫ్లాప్ షో.. సెలక్టర్లు ఇలా చేసినందుకే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook