Kaliyugam Pattanamlo Release Date: తెలుగు తెరపై వండర్లు క్రియేట్ చేస్తూ.. తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు యంగ్ మేకర్స్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలను తెరకెక్కిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. కొత్త తరహా కథనాలకు ఆడియన్స్ నుంచి ఎప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'కలియుగం పట్టణంలో' అనే టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేస్తుండగా.. రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్‌పై కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించారు.
Also Read: Farmer Loan Waiver: రుణ మాఫీ, పెన్షన్ పెంపుతో జగన్ ఎన్నికల గేమ్ చేంజ్ చేయనున్నారా
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కడప జిల్లాలోనే షూటింగ్‌ను ఫినిష్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. 45 రోజులపాటు చిత్రీకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేశామని చిత్ర నిర్మాత తెలిపారు. మార్చి 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదని ఆయన తెలిపారు. సరికొత్త పాయింట్‌తో సినిమాను రూపొందించామని.. మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా అలరిస్తుందన్నారు. త్వరలోనే ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించనున్నారు.
ఈ సినిమాకు ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ పనిచేస్తుండగా.. అజయ్ అరసాడ మ్యూజిక్ అందించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించారు. కెమెరామెన్‌గా చరణ్ మాధవనేని వ్యవహరించారు.
==> నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా తదితరులు
==> బ్యానర్ : నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
==> ప్రొడ్యూసర్స్: డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్
==> డైరెక్టర్స్: రమాకాంత్ రెడ్డి
==> మ్యూజిక్ డైరెక్టర్: అజయ్ అరసాడ
==> కెమెరామెన్ : చరణ్ మాధవనేని
==> సాహిత్యం : చంద్రబోస్, భాస్కర భట్ల
==> ఎడిటర్ : గ్యారీ బీహెచ్
==> PRO: సాయి సతీష్, రాంబాబు
Also Read: Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter